నాలుగేళ్లలో 20 సిటీలకు ‘స్మార్ట్ఈ’ విద్యుత్ త్రీ వీలర్ సేవల విస్తరణ

By sivanagaprasad kodatiFirst Published Dec 2, 2018, 2:19 PM IST
Highlights

త్రీ వీలర్ విద్యుత్ వాహనాల సంస్థ స్మార్ట్ సంస్థ తదుపరి విస్తరణ కోసం నాలుగేళ్లలో 20 మిలియన్ల డాలర్లు సమకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.100 నగరాల పరిధిలో సేవలను విస్తరించనున్నట్లు సంస్థ సీఈఓ గూల్డీ శ్రీ వాత్సవ తెలిపారు. 
 

దేశంలోకెల్లా అతిపెద్ద విద్యుత్ వాహనాల నిర్వహణ సంస్థ ‘స్మార్ట్ ఈ’ వచ్చే నాలుగేళ్లలో 20 నగరాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. తన ఆపరేషన్ల కోసం 20 మిలియన్ల డాలర్ల మేరకు పెట్టుబడి సేకరించాలన్నది స్మార్ట్ ఈ సంకల్పం. ప్రస్తుతం గుర్‌గ్రామ్ కేంద్రంగా సేవలందిస్తున్న ‘స్మార్ట్ ఈ’ ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంత పరిధిలో వెయ్యి త్రీ వీలర్ విద్యుత్ ఆధారిత ఆటోలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. 

2022 నాటికి లక్ష విద్యుత్ వాహనాలకు డిమాండ్ వస్తుందని స్మార్ట్ ఈ అంచనా వేస్తోంది. ‘స్మార్ట్ ఈ’ సీఈఓ, సహా వ్యవస్థాపకుడు గూల్డీ శ్రీ వాత్సవ మాట్లాడుతూ మెట్రో మౌలిక వసతులు ఉన్న చోట గానీ, అభివ్రుద్ది చెందుతున్న నగరాలపై తాము కేంద్రీకరించామని తెలిపారు. తద్వారా మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాల తగ్గుతుందన్నారు. ఇది 17 మిలియన్ల చెట్లకు సమానం అని తెలిపారు. 

ఈ క్రమంలో స్వల్పకాలికంగా 15-20 మిలియన్ల డాలర్ల పెట్టుబడి సమీకరించాలని ప్రణాళికను రూపొందించామని తెలిపారు. మూడేళ్ల క్రితం కార్యకలాపాలు నిర్వహణ ప్రారంభించింది ‘స్మార్ట్ ఈ’. మదుపర్ల నుంచి ఐదు మిలియన్ల డాలర్ల పెట్టుబడులు సేకరించడం లక్ష్యం. 

గతవారం ఈ సంస్థ ఎలక్ట్రిక్ వెహికిల్స్ సొల్యూషన్స్ సంస్థ ‘సన్ మొబిలిటీ’తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో వాహనాల విద్యుత్ చార్జింగ్ మౌలిక వసతుల కల్పన కోసం ఈ సంస్థ ‘సన్ మొబిలిటీ’ సహకరించనున్నది. 

వచ్చే 24 నెలల్లో 100కి పైగా మెట్రో నగరాల పరిధిలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్మార్ట్ ఈ సీఈఓ శ్రీవాత్సవ తెలిపారు. 12 వేల విద్యుత్ త్రీ వీలర్ వాహనాలకు డిమాండ్ ఏర్పడుతోంది. తొలి దశలో 500 విద్యుత్ ఆధారిత త్రీ వీలర్ వాహనాలకు ‘సన్ మొబిలిటీ’ బ్యాటరీ వసతులను అందుబాటులోకి తేనున్నది. 

మార్కెట్లోకి ఆస్టన్ మార్టిన్ వీ8 వాంటేజ్
బ్రిటన్ కు చెందిన విలాసవంతమైన స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ దేశీయ మార్కెట్లోకి కొత్తగా వీ8 వాంటేజ్ కారును తీసుకు వచ్చింది. ఈ పెట్రోల్ ఆధారిత కారులో మూడు రకాలు ఉన్నాయి. కనిష్టంగా రూ.1.64 కోట్లు, గరిష్టంగా రూ.3.27 కోట్లకు లభిస్తుంది. ఈ కారును అహ్మదాబాద్ నగరంలో ఆస్టన్ మార్టిన్ భారత్ అధిపతి సందీప్ గుప్తా మార్కెట్లోకి విడుదల చేశారు. 

click me!