ఈ ఎలక్ట్రిక్ స్క్యూటర్ 35 లీటర్ల అండర్ సీటు స్టోరేజ్ అందిస్తుంది. సింపుల్ డాట్ వన్ స్టాండర్డ్ 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, 72 Nm గరిష్ట టార్క్ రేటింగ్ ఉన్న 8.5 kW ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. డాట్ వన్ విభాగంలో 0-40 కి.మీ/గం 2.77 సెకన్ల సమయంతో అత్యంత వేగవంతమైనదని కంపెనీ పేర్కొంది.
ఇండియన్ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాల ఆదరణ పెరుగుతుంది. దింతో కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా సింపుల్ ఎనర్జీ డాట్ వన్ ఇ-స్కూటర్‌ను రూ. 99,999 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) ప్రారంభ ధరకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సింపుల్ డాట్ వన్ సింగిల్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. అలాగే నమ్మ రెడ్, బ్రాజెన్ బ్లాక్, గ్రే వైట్ అండ్ అజూర్ బ్లూ అనే నాలుగు రంగుల్లో వస్తుంది. దీనికి టచ్ స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో అమర్చబడి ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ స్క్యూటర్ 35 లీటర్ల అండర్ సీటు స్టోరేజ్ అందిస్తుంది. సింపుల్ డాట్ వన్ స్టాండర్డ్ 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, 72 Nm గరిష్ట టార్క్ రేటింగ్ ఉన్న 8.5 kW ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. డాట్ వన్ విభాగంలో 0-40 కి.మీ/గం 2.77 సెకన్ల సమయంతో అత్యంత వేగవంతమైనదని కంపెనీ పేర్కొంది.
సర్టిఫైడ్ రేంజ్ 151 కి.మీ ఇంకా IDC పరిధి 160 కి.మీ. డాట్ వన్‌లో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్ ఇంకా వెనుకవైపు మోనోషాక్ ఉన్నాయి. అలాగే అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది, డిస్క్ బ్రేక్‌లు కూడా అందించారు.
బెంగుళూరు నుండి సింపుల్ వన్ బుక్ చేసుకునే వారికి సింపుల్ డాట్ వన్ ప్రత్యేకంగా అందించబడుతుంది. స్టాక్‌లు ఉన్నంత వరకు పరిచయ ధరలు పరిమిత కాలానికి చెల్లుబాటు అవుతాయి. డెలివరీలు బెంగళూరులో మొదట ప్రారంభమవుతుంది, తరువాత దశలవారీగా ఇతర నగరాలకు విస్తరిస్తుంది.