పెరిగిన R E బుల్లెట్ 350 ధరలు.. ఎంతంటే..

By Sandra Ashok Kumar  |  First Published Nov 15, 2019, 11:44 AM IST

ప్రముఖ విలాసవంతమైన మోటారు సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ తన బుల్లెట్ 350 బైక్‌ల ధరలు పెంచివేసింది. కిక్ స్టార్ట్ బైక్ ధర రూ.2,755, ఎలక్ట్రిక్ స్టార్ట్ బైక్ ధర రూ.4,365 పెంచింది. 


న్యూఢిల్లీ: విలాసవంతమైన మోటారు బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన మోటారు సైకిళ్ల ధరలను పెంచివేసింది. ఈ ఏడాది ఆగస్టులో మార్కెట్లో ప్రవేశపెట్టిన ‘బుల్లెట్ 350` మోడల్ కొత్త బైకుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.

also read కొత్త హోండా ఎస్పీ 125 బిఎస్ 6 బైక్ విడుదల

Latest Videos

కిక్ స్టార్ట్ బుల్లెట్ 350 బైక్ ధర రూ.2,755, ఎలక్ట్రిక్ స్టార్ట్ బుల్లెట్ 350 మోడల్ ధర రూ.4,365 మేరకు పెంచింది.ధర పెంచడానికి ముందు కిక్ స్టార్ట్ మోడల్ ధర రూ.1.12 లక్షలు, ఎలక్ట్రిక్ స్టార్ట్ ధర రూ.1.26 లక్షలుగా ఉంది. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోడల్‌లో సింగిల్ చానల్ ఏబీఎస్, 280 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 346 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ బైక్ 19.8 బీహెచ్పీ శక్తిని, 4000 ఆర్పీఎం వద్ద 28 ఎన్ఎం టార్చ్‌ను విడుదల చేస్తుంది. 

బుల్లెట్లో అత్యంత చౌక మోడల్ బైక్‌ను ఈ ఏడాది ఆగస్టులో రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేసింది. రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ల విక్రయాలు ఇటీవల పండుగ సీజన్‌లో పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలోనే స్వల్పంగా ధరలు పెంచాలని రాయల్ ఎన్ఫీల్డ్ నిర్ణయించింది. 

also read యమహా ఎఫ్‌జడ్ & ఫాజర్ 25 మోడల్స్ రీకాల్

సౌకర్యవంతమైన డిజైన్‌, మెరుపు వేగానికి పెట్టింది పేరు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌. బైక్‌ల గురించి ఆలోచించగానే ముందుకు గుర్తుకు వచ్చేది ఈ ద్విచక్రవాహనమే. దాంట్లో బుల్లెట్‌ మోడల్‌కి ఉండే క్రేజే వేరు. భారత విపణిలో అత్యంత విజయవంతమైన బైక్‌లలో ఇదొకటి. 
 

click me!