మీరు కార్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా.. అయితే రూ.8 లక్షలలోపు లభిస్తున్న 5 కార్లు ఇవే..

By asianet news telugu  |  First Published Apr 7, 2023, 12:34 PM IST

ఎంతో మంది భారతీయ గృహాలలో మొదటి కార్ మారుతి సుజుకి డిజైర్. దీని ధర రూ. 6.44 లక్షల నుండి రూ. 9.31 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటుంది.


ప్రస్తుతం మార్కెట్లో చాలా తక్కువ సెడన్ కార్లు ఉన్నాయి . SUV కార్ల పట్ల ప్రాధాన్యత కారణంగా ఈ క్షీణత ఏర్పడింది. అయితే మీరు సెడాన్‌ కార్  కొనేందుకు ఆలోచన చేస్తున్నట్లయితే మీ బడ్జెట్ రూ.8 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే మీరు పరిగణించవలసిన 5 కార్లు ఉన్నాయి...

మారుతి సుజుకి డిజైర్
ఎంతో మంది భారతీయ గృహాలలో మొదటి కార్ మారుతి సుజుకి డిజైర్. దీని ధర రూ. 6.44 లక్షల నుండి రూ. 9.31 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటుంది. ఈ సెడాన్ LXi, VXi, ZXi అండ్ ZXi+ అనే నాలుగు ట్రిమ్ లెవెల్స్ లో వస్తుంది. వీటిలో VXi ఇంకా ZXi ట్రిమ్‌లు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కిట్‌తో వస్తాయి.

Latest Videos

undefined

డిజైర్ లో ఒకే ఒక ఇంజన్ ఆప్షన్ ఉంది - 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్,  ఈ కారు మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్  ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఫీచర్ల వారీగా మారుతి డిజైర్ కారులో AC, Android Auto, Apple CarPlay కనెక్టివిటీ, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి దాదాపు అన్ని ఆధునిక ఫీచర్లతో వస్తుంది.

హోండా అమేజ్
హోండా అమేజ్ ప్రస్తుతం దేశంలో హోండా ఇండియా రీటైల్ చేస్తున్న రెండవ మోడల్. డిజైర్ లాగానే సబ్-కాంపాక్ట్ అమేజ్ ధర రూ. 6.99 లక్షల నుండి రూ. 9.60 లక్షల మధ్య ఉంటుంది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).  E, S అండ్ VX అనే మూడు ట్రిమ్ లేలేవ్స్ లో అందుబాటులో ఉంది. ఈ కార్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్  CNG కిట్‌తో రావు. 

ఈ కార్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా CVT గేర్‌బాక్స్‌తో పొందవచ్చు. దీని ఫీచర్ల విషయానికొస్తే, అమేజ్ క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్‌తో పాటు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్లు, రియర్‌వ్యూ కెమెరా మొదలైన ఫీచర్స్ పొందుతుంది.

హ్యుందాయ్ ఆరా
గ్రాండ్ ఐ10 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా హ్యుందాయ్ ఆరా దేశంలో రూ. 6.30 లక్షల నుండి రూ. 8.87 లక్షల మధ్య ధర ఉన్న మరో పాపులర్ సెడాన్ కార్. ఈ సబ్-కాంపాక్ట్ సెడాన్ కార్ నాలుగు ట్రిమ్ లెవెల్స్ లో లభిస్తుంది - E, S, SX అండ్ SX(O), అలాగే S అండ్ SX ట్రిమ్  మాత్రమే CNG-కిట్ ఆప్షన్ తో ఉంటాయి. 

దీని స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, క్రూయిజ్ కంట్రోల్, ESC ఇంకా రివర్సింగ్ కెమెరా వంటి అధునాతన ఫీచర్లతో పాటు ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. అలాగే, హ్యుందాయ్ ఆరా నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ స్టాండర్డ్ గా పొందే ఏకైక సెడాన్ కార్.  టాప్ వేరియంట్‌ కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతాయి.

టాటా టిగోర్
టాటా టిగోర్ సెడాన్ నాలుగు ట్రిమ్ లెవెల్స్ లో లభిస్తుంది - XE, XM, XZ అండ్ XZ+. ఇందులో XM, XZ ఇంకా XZ+ ట్రిమ్ లెవెల్స్ లో మాత్రమే CNG కిట్‌తో వస్తాయి. అన్ని ట్రిమ్ లెవెల్స్ 1.2-లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతాయి. దీనికి 5-స్పీడ్ AMT గేర్ లేదా 5-స్పీడ్ MT గేర్ ఆప్షన్ ఉంది. దాని స్పెసిఫికేషన్ల విషయానికొస్తే టిగోర్ లో ఏడు అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో వస్తుంది, కీలెస్ ఎంట్రీ, Apple CarPlay ఇంకా Android Autoకి సపోర్ట్ చేస్తుంది. అలాగే, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్‌ పొందిన లిస్ట్ లో ఉన్న ఏకైక సెడాన్ ఇదే. 

మారుతి సుజుకి టూర్ S
మారుతి సుజుకి టూర్ S అనేది వాణిజ్య ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడినప్పటికీ దీని ధర రూ. 6.51 లక్షలతో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభిస్తున్న మరొక బడ్జెట్ సెడాన్ కార్. డిజైర్ కార్ పొందే ప్రీమియం ఫీచర్లు ఇందులో లేకపోవచ్చు. కానీ 1.2 లీటర్ ఇంజన్ మాత్రం ఉంది. దానితో పాటు, సెడాన్‌లో సింగిల్ ఎయిర్‌బ్యాగ్, ఎయిర్ కండీషనర్ ఇంకా ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉన్నాయి.

click me!