షియోమీ మొదటి ఎలక్ట్రిక్ కారు ఫోటో లీక్.. ఎంట్రీకి ముందే సోషల్ మీడియాలో వైరల్..

By asianet news teluguFirst Published Feb 4, 2023, 4:46 PM IST
Highlights

మీడియా నివేదికల ప్రకారం, ఇప్పుడు షియోమీ  ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కారు ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఈ ఫోటో Xiaomi నుండి రాబోయే ఎలక్ట్రిక్ కారు అని క్లెయిమ్ చేస్తున్నారు.

మొబైల్‌లు, టీవీలు వంటి ఎన్నో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఇప్పటి వరకు తయారు చేసిన చైనా కంపెనీ షియోమీ  తాజాగా ఎలక్ట్రిక్ కారును కూడా ప్రవేశపెట్టింది. మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ కారు లాంచ్ ముందే ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. షియోమీ  ఎలక్ట్రిక్ కారు ఫీచర్లు గురించి మీకోసం...

లీకైన ఫోటో
మీడియా నివేదికల ప్రకారం, ఇప్పుడు షియోమీ  ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కారు ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఈ ఫోటో Xiaomi నుండి రాబోయే ఎలక్ట్రిక్ కారు అని క్లెయిమ్ చేస్తున్నారు.

పేరు ఏమిటి
మీడియా నివేదికల ప్రకారం, Xiaomi ఎలక్ట్రిక్ కారు పేరు MS11 కావచ్చు. లీకైన ఫోటోలో కారుపై MS11 నేమ్‌ప్లేట్ కూడా కనిపిస్తుంది. ఇంకా 2021 సంవత్సరంలోనే ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి ప్రవేశించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనితో పాటు, రాబోయే 10 సంవత్సరాలలో కంపెనీ 10 బిలియన్ డాలర్లను కూడా పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.

లుక్ ఎలా ఉందంటే 
 సోషల్ మీడియాలో ఫోటో లీక్ కావడంతో వైరల్ అవుతున్న దీని డిజైన్ చాలా కార్ల నుండి ప్రేరణ పొందింది. ఫస్ట్ లుక్ లో కారు కూడా BYD  సీల్ లాగే కనిపిస్తుంది. కారులో LED హెడ్‌లైట్లు ఇచ్చారు. అంతేకాకుండా, కారు డ్యూయల్ టోన్ స్కీమ్‌తో వాస్తుంది. కారు రూపకల్పనలో ఏరోడైనమిక్స్ జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఈ కారణంగా కారు మైలేజ్ మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. అయితే కారు ఇతర ఫీచర్ల గురించి సమాచారం వెల్లడించలేదు.

చైనాలో ప్రదర్శించబడుతుంది
మీడియా నివేదికల ప్రకారం  కూడా చైనాలో టెస్టింగ్ సమయంలో కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు చాలాసార్లు కనిపించిందని పేర్కొంది. అలాగే, కంపెనీ ఈ సెడాన్ ఎలక్ట్రిక్ కారును ముందుగా చైనాలో విడుదల చేయవచ్చు. దీని తర్వాత యూరప్‌తో సహా కొన్ని దేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు.

click me!