‘ప్రైమ్ ప్లస్’ సర్వీస్‌ను హైదరాబాద్‌ సహా ప్రముఖ మెట్రో నగరాలకు విస్తరించిన ఓలా.. నేటి నుండి అందుబాటులోకి..

By asianet news teluguFirst Published Aug 4, 2023, 4:54 PM IST
Highlights

మెరుగైన సౌకర్యం, విశ్వసనీయత,  సౌలభ్యంతో కస్టమర్ సంతృప్తిని గణనీయంగా పెంచేందుకు ఓలా ఈ సర్వీసును ప్రారంభించింది. ప్రైమ్ ప్లస్ ఈరోజు నుండి మూడు నగరాల్లోని ఎంపిక చేసిన కస్టమర్‌లకు అందుబాటులోకి వస్తుంది. 
 

బెంగుళూరు, ఆగస్ట్ 04, 2023: భారతదేశంలోనే అతిపెద్ద రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్  ఓలా, బెంగళూరులో అద్భుతమైన స్పందనను అందుకున్న తర్వాత  'ప్రైమ్ ప్లస్' ప్రీమియం సర్వీస్‌ను హైదరాబాద్‌, ముంబై, పూణేకు విస్తరించింది. ప్రైమ్ ప్లస్‌ ద్వారా ఓలా ప్రొఫెషనల్ డ్రైవర్లతో అసాధారణమైన రైడ్ హెయిలింగ్ అనుభవాన్ని అందించడమే కాకుండా రైడ్ కాన్సలేషన్స్ అండ్ కార్యాచరణ ఇబ్బందులను తొలగిస్తుంది.

మెరుగైన సౌకర్యం, విశ్వసనీయత,  సౌలభ్యంతో కస్టమర్ సంతృప్తిని గణనీయంగా పెంచేందుకు ఓలా ఈ సర్వీసును ప్రారంభించింది. ప్రైమ్ ప్లస్ ఈరోజు నుండి మూడు నగరాల్లోని ఎంపిక చేసిన కస్టమర్‌లకు అందుబాటులోకి వస్తుంది. 

“బెంగుళూరులో విజయవంతమైన పైలట్ తర్వాత, ప్రైమ్ ప్లస్ సర్వీస్  నగరం పూర్తి స్థాయి విస్తరణకి మంచి స్పందనను చూసింది. ఈ విజయంతో ఉల్లాసంగా ఉన్న మేము ఇప్పుడు బెంగుళూరు దాటి ముంబై, పూణే ఇంకా  హైదరాబాద్‌లకు ఈరోజు నుండి విస్తరిస్తున్నాము. పూర్తి స్థాయి రోల్‌అవుట్ త్వరలో మొదలవుతుంది, ”అని ఓలా ప్రతినిధి తెలిపారు

2011లో సేవలను ప్రారంభించిన ఓలా, ప్రపంచంలోని కొన్ని లాభదాయకమైన  వినియోగదారు ఇంటర్నెట్ కంపెనీలలో ఒకటి. మార్కెట్ లీడర్‌గా ఉండటమే కాకుండా, 200 నగరాల్లో కార్యకలాపాలు, ప్లాట్‌ఫారమ్‌లో 1 మిలియన్ కంటే ఎక్కువ డ్రైవర్లతో భారతదేశంలో అతిపెద్ద రైడ్-హెయిలింగ్ నెట్‌వర్క్‌గా కూడా ఓలా ఉంది.

About Ola:
Ola is India’s largest mobility platform and one of the world’s largest ride-hailing companies. Ola revolutionized urban mobility by making it available on-demand for over a billion people across 3 continents. Today, Ola continues to move the world to sustainable mobility through its ride-hailing platform as well as through advanced electric vehicles manufactured at its Future Factory, the largest, most advanced, and sustainable two-wheeler factory in the world. Ola is dedicated to transitioning the world to sustainable mobility and making the world better than we found it.

click me!