40% మార్కెట్ వాటాతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఓలా, సేల్స్ లో 375% వృద్ధి.. బడ్జెట్ ధరలో అందుబాటులోకి S1..

By asianet news teluguFirst Published Aug 1, 2023, 12:10 PM IST
Highlights

Ola S1 ఎయిర్ కస్టమర్ల నుండి మంచి స్పందనను పొందింది ఇంకా 50,000+ బుకింగ్‌లను నమోదు చేసుకుంది. అధిక డిమాండ్ అలాగే దాని ప్రారంభ ధరలో స్కూటర్ లభ్యతను పొడిగించమని అనేక అభ్యర్థనల మేరకు, కంపెనీ కస్టమర్లందరికీ INR 1,09,999 ఆకర్షణీయమైన ప్రారంభ ధరకే  కొనుగోలు చేసే అవకాశాన్ని ఆగస్టు 15 వరకు పొడిగించింది.

బెంగళూరు : భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, జూలై నెలలో ఆకట్టుకునే అమ్మకాలను సాధించి EV 2W మార్కెట్‌లో  బలమైన స్థానాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ జూలైలో దాదాపు 19,000 యూనిట్లను విక్రయించి (వాహన్ డేటా ప్రకారం) ~40% వాటాతో మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఓలా గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలలో 375% Y-o-Y వృద్ధిని సాధించింది.

ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ మాట్లాడుతూ, “ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ లీడర్ గా స్థానాన్ని నిలబెట్టుకుంది ఇంకా #EndICEAge నినాదాన్ని నిజం చేసేందుకు నిబద్ధతతో  ఉంది. విప్లవాత్మకమైన S1 ఎయిర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నందున, మా ఈ సరికొత్త ప్రోడక్ట్  స్కూటర్ సెగ్మెంట్‌లో EV మాస్ మార్కెట్‌ అడాప్షన్ ను ఊపందుకునేలా చేస్తుంది. తద్వారా భారతదేశం యొక్క EV వ్యాప్తిని వేగవంతం చేయడానికి ఓలా ఎంతో తోడ్పడుతుంది. అత్యంత అందుబాటు ధరలో వస్తున్న S1 ఎయిర్ ICE స్కూటర్‌లకు సరైన సమాధానం, ఇంకా దాని అతి తక్కువ TCO (Total Cost of Ownership) తో ఇది #EndICEAgeని మరింత వేగవంతం చేస్తుంది. ఆగస్ట్‌లో S1 ఎయిర్ డెలివరీల గురించి అలాగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా యొక్క వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ జరుగుతుండడంతో మేము సంతోషిస్తున్నాము." అని అన్నారు. 

Ola S1 ఎయిర్ కస్టమర్ల నుండి మంచి స్పందనను పొందింది ఇంకా 50,000+ బుకింగ్‌లను నమోదు చేసుకుంది. అధిక డిమాండ్ అలాగే దాని ప్రారంభ ధరలో స్కూటర్ లభ్యతను పొడిగించమని అనేక అభ్యర్థనల మేరకు, కంపెనీ కస్టమర్లందరికీ INR 1,09,999 ఆకర్షణీయమైన ప్రారంభ ధరకే  కొనుగోలు చేసే అవకాశాన్ని ఆగస్టు 15 వరకు పొడిగించింది.

తక్కువ రన్నింగ్ అండ్  మెయింటెనెన్స్ ఖర్చుతో S1 ఇంకా S1 ప్రో నుండి  అత్యాధునిక టెక్నాలజీ, డిజైన్ అంశాలను S1 ఎయిర్ అందిస్తుంది, అదే సమయంలో నమ్మశక్యం కాని ధరతో అందుబాటులోకి వస్తుంది. బలమైన 3 kWh బ్యాటరీ కెపాసిటీ, 125 కిమీ సర్టిఫైడ్ రేంజ్, 90 కి.మీ/గంటకు చెప్పుకోదగిన టాప్ స్పీడ్‌తో, Ola S1 ఎయిర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది.

About Ola
Ola is India’s largest mobility platform and one of the world’s largest ride-hailing companies. Ola revolutionized urban mobility by making it available on-demand for over a billion people across 3 continents. Today, Ola continues to move the world to sustainable mobility through its ride-hailing platform as well as through advanced electric vehicles manufactured at its Futurefactory, the largest, most advanced, and sustainable two-wheeler factory in the world. Ola is dedicated to transitioning the world to sustainable mobility and making the world better than we found it.

click me!