ఓరి దేవుడా! వీటిని తయారు చేసే ఈ కంపెనీ కుక్కకు ఉద్యోగం ఇచ్చింది, ఏం పని చేస్తుందో తెలుసా..

By asianet news teluguFirst Published Aug 12, 2023, 12:32 AM IST
Highlights

ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ తన ట్విట్టర్ హ్యాండిల్ అంటే అధికారిక X ఖాతాలో కొత్త ఉద్యోగి చేరడం గురించి తెలియజేశారు. అతను ఈ  కుక్క ఉద్యోగ ID కార్డును కూడా షేర్ చేసారు. దీనిలో కుక్క ముఖం ఇంకా దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.
 

 కొన్ని నెలల క్రితం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ ఓ ఫోటోని షేర్ చేసి ఓ కుక్కను ట్విట్టర్ సీఈవోగా చేశాడు. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఏకంగా కుక్కకు ఉద్యోగం ఇచ్చింది. ఈ రెండు వార్తలు చాలా షాకింగ్‌గా మారాయి. ఓలా ఎలక్ట్రిక్ తీసుకున్న స్టెప్ గురించి సోషల్ మీడియాలో ఒక రౌండ్ చర్చలు మొదలయ్యాయి. ఈ కొత్త ఉద్యోగి (కుక్క) పేరు బిజిలీ. ఈ కుక్కను నియమించిన తర్వాత, కంపెనీ దానికి ID కార్డును కూడా తయారు చేసింది.

ఐడీ కార్డును షేర్ చేసిన కంపెనీ సీఈవో 

ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ తన ట్విట్టర్ హ్యాండిల్ అంటే అధికారిక X ఖాతాలో కొత్త ఉద్యోగి చేరడం గురించి తెలియజేశారు. అతను ఈ  కుక్క ఉద్యోగ ID కార్డును కూడా షేర్ చేసారు. దీనిలో కుక్క ముఖం ఇంకా దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.

కుక్క ID కార్డ్‌లో ఏ వివరాలు ఉన్నాయంటే 

ఈ కుక్క పేరు బిజిలి దీని అర్ధం ఇంగ్లిష్ లో  ఎలక్ట్రిక్ సిటీ(Electricity). దాని  ID కార్డ్‌లో ఎంప్లాయీ కోడ్ (440V), ఫోటో, బ్లడ్ గ్రూప్ (PAW+ve) ఇంకా దాని  కాంటాక్ట్ వివరాలు, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లో BA  ఆఫీస్  అని ఉంది. ఐడీ కార్డ్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం, ఈ కుక్కను కంపెనీ బెంగళూరులోని కోరమంగళ బ్రాంచ్‌లో పోస్టింగ్ చేసింది.  భవిష్ అగర్వాల్ చేసిన ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు మిలియన్ల మంది వినియోగదారులు చూశారు, ఇంకా  భిన్నమైన  రీట్వీట్స్ వస్తున్నాయి.

బిజిలి కుక్క  ఎం చేస్తుంది

ఓలా ఎలక్ట్రిక్ డాగ్‌ని ఏ పని చేయనుందనే చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ కుక్క ఉద్యోగులు  చేసే ఏ విధమైన పనిని చేయదు. అయితే అందరి దృష్టిని ఆకర్షించడం కోసమే కంపెనీలోకి  అడుగు పెట్టింది. కొద్ది రోజుల క్రితం ఎలాన్ మస్క్ కూడా ఇదే స్టెప్ వేశారు.

ఆఫీసులకి పెంపుడు జంతువులను తీసుకురావడం ఎల్లప్పుడూ పాజిటివ్ ఇంకా ఆహ్లాదకరమైన పని వాతావరణాన్ని సృష్టించడంలో భాగంగా ఉంది, అనేక కంపెనీలు ఇప్పుడు ఒక అడుగు వేస్తూ వీటిని అధికారికంగా తమ ఉద్యోగులుగా చేర్చుకుంటున్నాయి. Ola లాగానే, InMobi, OnePlus India ఇంకా  Zerodha వంటి కంపెనీలు కూడా కుక్కలను దత్తత తీసుకున్నాయి ఇంకా కంపెనీలో వాటికి ప్రత్యేక హోదాలను కేటాయించాయి. కొన్ని సంవత్సరాల క్రితం, బ్రెజిల్‌లోని హ్యుందాయ్ షోరూమ్ 'టక్సన్ ప్రైమ్' అనే కుక్కను నియమించుకుంది. కంపెనీ కుక్కను నియమించడమే కాకుండా, బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు 'ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్' బిరుదును కూడా ఇచ్చింది.

 

New colleague now officially! pic.twitter.com/dFtGMsOFVX

— Bhavish Aggarwal (@bhash)
click me!