ప్రముఖ కార్ల తయారీ కంపనీ నిస్సాన్ ఇండియా భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై దాదాపు యాబై వేల నుండి లక్ష వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆగస్ట్ నెలకు మాత్రమే పరిమితమని, ఈ నెలలో తమ వాహనాలను కొనుగోలు చేసిన వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని నిస్సాన్ స్పష్టం చేసింది.

నిస్సాన్ మైక్రా, మైక్రా యాక్టివా, సన్నీ సెడాన్ మరియు టెరానో మోడళ్లను ఈ ఆగస్ట్ ఆఫర్ కింద అందించనున్నారు. తగ్గింపు ధరలకు వాహనాలు లభించడంతోపాటు అదనంగా ఇన్సూరెన్స్ సదుపాయం, ఈఎమ్‌ఐ కింద తక్కువ ఇంటరెస్ట్ రేట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.
ఈ ఆగస్ట్ ఆఫర్ కింద అందించే డిస్కౌంట్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
1. నిస్సాన్ మైక్రా యాక్టివా: వినియోగదారులకు మొత్తం రూ. 35 వేల విలువగల ఆపర్లు (రూ. 20,000 ఫ్రీ ఇన్సూరెన్స్, రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, ప్రభుత్వ ఉద్యోగులకు రూ.5,000 తగ్గింపు)
2. నిస్సాన్ మైక్రా: ఈ మోడల్ వాహనాల కొనుగోలుపై 42,500 ఆఫర్ (రూ. 25,000 ఫ్రీ ఇన్సూరెన్స్, 12,000క్యాష్ డిస్కౌంట్, ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 5,000 తగ్గింపు)
3. నిస్సాన్ టెర్రానో: ఈ మోడల్ కారు కొనుగోలుపై రూ.85,000 ఆఫర్ (రూ. 85,000 ఫ్రీ ఇన్సూరెన్స్, 30,000 క్యాష్ డిస్కౌంట్, ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 10,000 తగ్గింపు)
4. నిస్సాన్ సన్నీ : ఈ మోడల్ కారు కొనుగోలుపై రూ.42,000 ఆఫర్ (రూ. 35,000 ఫ్రీ ఇన్సూరెన్స్, ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 7,000 తగ్గింపు)