మారుతీ సుజుకి నుండి మరో మధ్యతరగతి కారు విడుదల...

By Arun Kumar PFirst Published Nov 21, 2018, 3:11 PM IST
Highlights

మధ్యతరగతి ప్రజల అభిరుచికి తగ్గట్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ కార్లను మార్కెట్లోకి తీసుకువస్తుంటుంది మారుతి సుజుకి. సగటు వేతనజీవులకు కూడా అందుబాటులో వుండే అనేక మోడల్లు ఈ కంపనీ భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. తాజాగా  మరోసారి మధ్య తరగతి వినియోగదారులనే టార్గెట్ చేస్తూ మారుతి సుజుకి నుండి కొత్త మోడల్ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. 
 
పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో కూడిన కొత్త ఎర్టిగా మోడల్ ను మారుతి సుజుకి ఇండియాలో లాంచ్ చేసింది. సాధారణ వెర్షన్ రెండు ఇంజన్లతో వస్తుండగా... ఆటోమెటిక్ వెర్షన్‌లో మాత్రం కేవలం పెట్రోల్ ఇంజనే అందుబాటులో ఉంది.  పెట్రోల్ ఇంజన్ మోడల్ లీటరుకు 19.34 కిలోమీటర్లు, డీజిల్ ఇంజన్ మోడల్ లీటర్ కు 25.47  కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని మారుతి సుజుకి ప్రతినిధులు వెల్లడించారు.

ఇక ఈ ఎర్టిగా మోడల్ ప్రారంభ ధరను కంపనీ రూ.7.44 లక్షలుగా నిర్ణయించారు. అయితే పెట్రోల్ ఇంజన్ కారు ధర రూ.9.18 లక్షల నుంచి రూ.9.95 లక్షలుగా నిర్ణయించగా డీజిల్ ఇంజన్ కారు ధరను రూ.9.18 లక్షల నుంచి రూ.9.95 లక్షలుగా నిర్ణయించినట్లు మారుతి సుజుకి కంపనీ వెల్లడించింది. 
 
click me!