హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమాలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, వాక్ అసిస్ట్ ఫంక్షన్, రివర్స్ మోడ్, రీజెనరేటివ్ బ్రేకింగ్, రిమోట్ లాక్‌తో కూడిన యాంటీ థెఫ్ట్ అలారం, USB ఛార్జింగ్ పోర్ట్ ఇంకా LED హెడ్‌లైట్లు ఉన్నాయి.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఆప్టిమా సిఎక్స్ 2.0 అండ్ 5.0లను కొన్ని నెలల క్రితం అప్‌డేటెడ్ ఫీచర్లతో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో వచ్చే ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంకా రెండూ హై-స్పీడ్ (CX) మోడల్స్. రెండింటి టాప్ స్పీడ్ గంటకు 45 కి.మీ. అలాగే, ఆప్టిమా ఎలక్ట్రిక్ మైలేజ్ పరంగా కూడా స్ట్రాంగ్ గా ఉంది. ధరతో సహా Hero Optima CX స్పెసిఫికేషన్‌లు మీకోసం..
మోటార్, రేంజ్ అండ్ స్పీడ్
ఆప్టిమా CX 550W BLDC హబ్ మోటార్ పై ఆధారపడుతుంది, ఇది 1.2kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనిని రిమూవబుల్ 51.2V, 30Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో తీసుకొస్తున్నారు. నాలుగు నుంచి ఐదు గంటల పాటు బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. స్పీడ్ విషయానికొస్తే 45 kmph స్పీడ్ వెళ్లగలదని పేర్కొంది. ఇప్పుడు మైలేజ్ గురించి మాట్లాడితే హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా స్టాండర్డ్ వేరియంట్ ఒక ఫుల్ ఛార్జ్‌తో 82 కి.మీల దూరాన్ని వెళ్లగలదని కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉంటే, CX ER వేరియంట్ 140 కి.మీ ప్రయాణిస్తుంది.
undefined
స్పెసిఫికేషన్లు
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమాలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, వాక్ అసిస్ట్ ఫంక్షన్, రివర్స్ మోడ్, రీజెనరేటివ్ బ్రేకింగ్, రిమోట్ లాక్‌తో కూడిన యాంటీ థెఫ్ట్ అలారం, USB ఛార్జింగ్ పోర్ట్ ఇంకా LED హెడ్‌లైట్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. ఇంకా డ్రమ్ బ్రేక్ సిస్టమ్‌ను పొందుతుంది అలాగే 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.
ధర
Optima CX సింగిల్ బ్యాటరీ CX వేరియంట్ ధర రూ. 67,190, డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ CX ER (ఎక్స్‌టెండెడ్ రేంజ్) వేరియంట్ ధర రూ. 85,190. రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ పోస్ట్ ఫేమ్ II సబ్సిడీ. వివిధ రాష్ట్రాల్లో దీని ధర మారవచ్చు.