Car Tires:ఈ టైర్లు ఎక్కువ మైలేజీని ఇస్తాయి.. భారతదేశపు మొదటి 5-స్టార్ రేటింగ్ టైర్స్..

By asianet news teluguFirst Published Jun 23, 2022, 4:18 PM IST
Highlights

కంపెనీ ప్రకారం, సాధారణ తక్కువ-స్టార్-రేటెడ్ టైర్ కంటే 5-స్టార్ ఉత్పత్తి సగటున 9.5 శాతం తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది . అలాగే,  నేరుగా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తుంది. 

భారత ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన స్టార్ లేబులింగ్ ప్రోగ్రామ్ కింద గుర్తింపు పొందిన భారతదేశంలోని ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌లో  మొదటి టైర్ బ్రాండ్‌గా మిచెలిన్ అవతరించిందని ప్రకటించింది.  మిచెలిన్ లాటిట్యూడ్ స్పోర్ట్ 3, మిచెలిన్ పైలట్ స్పోర్ట్ 4 ఎస్‌యూ‌వి టైర్లు ప్యాసింజర్ కార్ టైర్ విభాగంలో 5-స్టార్ రేటింగ్‌ను పొందగలిగాయి.

కంపెనీ ప్రకారం, సాధారణ తక్కువ-స్టార్-రేటెడ్ టైర్ కంటే 5-స్టార్ ఉత్పత్తి సగటున 9.5 శాతం తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది . అలాగే,  నేరుగా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తుంది. దీనితో పాటు Michelin Multi Energy Z Is కోసం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ద్వారా  4- స్టార్ రేటింగ్‌ను సాధించిన భారతదేశంలో మొదటి బ్రాండ్ టైటిల్‌ను కూడా కంపెనీ కైవసం చేసుకుంది.

కమర్షియల్ ఇండియా సెక్టార్ డైరెక్టర్ B2C మనీష్ పాండే మాట్లాడుతూ, “మిచెలిన్‌లో మొబిలిటీ  ఫ్యూచర్ పర్యావరణ అనుకూలమైన, సమర్థవంతమైన, సురక్షితమైన ఇంకా అందుబాటులో ఉండేలా చేయడంలో ఉందని మేము నమ్ముతున్నాము. తాజాగా మా వాణిజ్య వాహనాల టైర్లు భారతదేశంలో మా మొదటి ఫోర్-స్టార్ బ్రాండ్ లేబుల్ కోసం ఫస్ట్ 4-స్టార్‌లను సాధించాయి. భారతదేశంలో మా అత్యంత ప్రజాదరణ పొందిన రెండు ప్యాసింజర్ కార్ టైర్-లైన్‌లకు ఇండియా మొదటి 5-స్టార్ రేటింగ్‌తో మరోసారి గుర్తింపు పొందినందుకు మేము సంతోషిస్తున్నాము." అని అన్నారు.

కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది
తాజాగా ప్రెస్ నోట్‌లో విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, వాహనం తక్కువ-స్టార్ రేటింగ్ ఉన్న టైర్ల నుండి 5-స్టార్ ఉత్పత్తికి మారినప్పుడు సగటున 750 కిలోల Co2 తగ్గుతుందని కంపెనీ వివరించింది. 

మనీష్ పాండే మాట్లాడుతూ, "మా బ్రాండ్  ఈ మొదటి 5 స్టార్ రేటింగ్ మా కస్టమర్లలో మరింత విశ్వాసాన్ని నింపుతుంది. ఫ్యూయెల్-ఎఫిషియన్సీ, సురక్షితమైన ఇంకా దేశంలో కార్బన్ ఫూట్ ప్రింట్ తగ్గించే టైర్‌లను ఎంచుకోవడానికి ఉత్తమంగా ఉంటాయి. మా భారతీయ వినియోగదారులను భారతీయ రోడ్లపై సురక్షితంగా, సౌకర్యవంతంగా, సమర్థవంతంగా ఉంచడానికి అత్యంత అధునాతన సాంకేతికతను అందిస్తాము."అని అన్నారు.
 

click me!