Recalling 1 Million Cars: 10 లక్షల బెంజ్ కార్లు వెనక్కి.. కార‌ణం ఎంటో తెలుసా..?

By team teluguFirst Published Jun 5, 2022, 2:46 PM IST
Highlights

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెజ్ బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్.యు.వి సిరీస్‌లోని పలు కార్ల మోడళ్ళలో బ్రేక్ సిస్టమ్‌లో సమస్య ఉత్పన్నమైంది. దీంతో ఈ మోడళ్ళను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఆ ప్రకారంగా వివిధ మోడళ్ళకు చెందిన పది లక్షల కార్లు వెనక్కి తీసుకోనుంది. 
 

లగ్జూరియస్ కార్ల పేర్లు తలచుకోగానే గుర్తుకొచ్చేది మెర్సిడెజ్ బెంజ్. జర్మనీకి చెందిన టాప్ కార్ మేకర్స్ కంపెనీ ఇది. ఈ కంపెనీ బేసిక్ కారు ధరే 50 లక్షల రూపాయలకు పైగా ఉంటుంది. ఇక హైఎండ్ కార్ల ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది. జర్మనీలోని స్టట్‌గార్ట్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహిస్తోందీ మెర్సిడెజ్ బెంజ్. ఈ మధ్యకాలంలో చిప్ షార్టేజ్ వల్ల కొంత ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సకాలంలో డెలివరీలను ఇవ్వలేకపోతోంది.

తాజాగా- ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ కార్లను వెనక్కి పిలిపించాలని నిర్ణయించుకుంది. కార్ల బ్రేకింగ్ సిస్టమ్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2004 నుంచి 2015 మధ్యకాలంలో తయారైన వాటిల్లో 10 లక్షల కార్లను వెనక్కి పిలిపించేలా మెర్సిడెజ్ బెంజ్ త్వరలోనే ఆదేశాలను జారీ చేయనున్నట్లు జర్మన్ ఫెడరల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ తెలిపింది. ఎంఎల్, జీఎల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ సిరీస్, ఆర్-క్లాస్ లగ్జరీ మినీవ్యాన్‌లను రీకాల్ చేసినట్లు పేర్కొంది.

హార్డ్ బ్రేకింగ్ మాన్యువర్ వల్ల మెకానికల్ డ్యామేజెస్ ఏర్పడినట్లు భావిస్తున్నామని మెర్సిడెజ్ బెంజ్ గ్రూప్ ఏజీ వివరణ ఇచ్చింది. వెహికల్ బ్రేక్ బూస్టర్‌లో సమస్యలు తలెత్తి ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. బ్రేక్ బూస్టర్‌లో సాంకేతిక ఇబ్బందులు, మెకానికల్ డ్యామేజెస్ సంభవించడం అనేది అత్యంత అరుదైన విషయమని వ్యాఖ్యానించింది. దీన్ని సవరించడానికి చర్యలు తీసుకున్నామని, వాటిని రీకాల్ చేస్తామని పేర్కొంది. 

ప్రపంచవ్యాప్తంగా 9,93,000 ఎంఎల్, జీఎల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ సిరీస్, ఆర్-క్లాస్ లగ్జరీ మినీవ్యాన్‌లను విక్రయించింది మెర్సిడెజ బెంజ్. ఇందులో 70,000 కార్లు ఒక్క జర్మనీలోనే అమ్ముడయ్యాయి. ఆథరైజ్డ్ డీలర్ల ద్వారా ఇప్పుడు వాటన్నింటినీ రీకాల్ చేయనుంది. బ్రేక్ బూస్టర్‌లో సమస్యలను తొలగించిన అనంతరం వాటిని క్లయింట్లకు డెలివరీ చేస్తుంది. మూడునెలల వ్యవధిలో ఈ ప్రక్రియ మొత్తాన్నీ ముగించేలా మెర్సిడెజ్ బెంజ్ ప్రణాళికలను రూపొందించుకుంది.

click me!