మారుతీ మరో ఘనత.. 2 కోట్ల వాహనాలు విక్రయం!

By narsimha lode  |  First Published Dec 1, 2019, 2:53 PM IST

దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ 'మారుతీ సుజుకీ ఇండియా' మరో రికార్డు సాధించింది


న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ 'మారుతీ సుజుకీ ఇండియా' మరో రికార్డు సాధించింది. దేశీయ విపణిలో ప్యాసింజర్​ వాహనాల అమ్మకాలు రెండు కోట్ల మార్క్​ను దాటినట్లు ప్రకటించింది. దాదాపు 37 సంవత్సరాల కాలంలో ఈ ఘనతను సాధించినట్లు ఆ సంస్థ పేర్కొంది. 

'మారుతీ 800'తో భారత్​లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది మారుతీ సుజుకీ. ఈ సంస్థ తొలి కారును 1983 డిసెంబర్​ 14న విక్రయించింది. 

Latest Videos

కోటి ప్యాసింజర్​ వాహనాల విక్రయానికి 29 సంవత్సరాలు పట్టిందని,  తర్వాత కేవలం ఎనిమిది ఏళ్ల సమయంలోనే మరో కోటి వాహనాలు విక్రయించడంతో రెండు కోట్ల వాహనాల మార్క్​ను అందుకున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా పేర్కొంది. 

ఫ్యాక్టరీలో తయారైన సీఎన్జీ వాహనాలతోపాటు స్మార్ట్​ హైబ్రీడ్​ వాహనాలను, ఎనిమిది బీఎస్-​6 మోడళ్లను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఎండీ కెనిచీ అయూకవా తెలిపారు. సుజుకీ మోటార్స్​ కార్పొరేషన్​ నుంచి చిన్న సైజు.. విద్యుత్ వాహనాలను భారత మార్కెట్లోకి తేనున్నట్లు చెప్పారు.

click me!