మోడర్న్ ఫీచర్లతో మార్కెట్లోకి మారుతి ‘‘బాలినో’’

By sivanagaprasad kodatiFirst Published Jan 29, 2019, 11:59 AM IST
Highlights

మారుతి సుజుకి అంటేనే స్పెషల్.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్ల తయారీతోపాటు విక్రయాల్లోనూ ముందు వరుసలో నిలుస్తున్న మారుతి.. తాజాగా సరికొత్త ‘బాలెనో’ మోడల్ కారును మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. 

ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ ‘మారుతీ సుజుకి’ సరికొత్త మోడల్ కారును ‘బాలెనో’ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు పెట్రోల్‌ ప్రారంభ ధర రూ.5.45లక్షలు కాగా టాప్‌ వేరియంట్‌ ధర రూ.8.77 లక్షలు పలుకుతుంది. 

ఇక డీజిల్‌ మోడల్‌ బాలెనో మోడల్ కారు ధర 6.60 లక్షలతో ప్రారంభమై రూ.8.60 లక్షలు వరకు అందుబాటులో ఉంది. దేశీయ మార్కెట్లో అత్యుత్తమ హ్యాచ్‌బ్యాక్‌ మోడల్ కారుగా బాలెనో నిలిచింది.

పాత బాలెనో మోడల్ కారుతో పోలిస్తే కొత్తకారులో చెప్పుకోదగ్గ మార్పులే చేసింది. సరికొత్త బంపర్‌, గ్రిల్‌ను కొత్త బాలెనో కారుకు అమర్చారు. 2రంగుల 16 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను దీనికి అమర్చారు. ఫినిక్స్‌ రెడ్‌, మాగ్మా గ్రే అనే రెండు సరికొత్త రంగుల్లో ఈ కారు లభించనుంది.

ఇంటీరియర్‌గా ఇన్ఫోటైన్‌మెంట్‌లో కీలక మార్పులను మారుతీ చేసింది. మారుతీ అభివృద్ధి చేసిన స్మార్ట్‌ప్లే స్టూడియోను దీనిలో అమర్చారు. దీనిలో యాపిల్‌ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో వ్యవస్థలు ఉన్నాయి.

దీంతోపాటు ఏడు అంగుళాల టచ్ స్క్రీన్‪ను అమర్చారు. మరింత పొడవైన కొత్త స్పోర్టీ ఫ్రంట్‌ గ్రిల్‌ అదనంగా చేర్చారు. ఇంజిన్‌కు సంబంధించి ఎటువంటి మార్పులు చేయలేదు. సీవీటీ వేరియంట్‌లో అదనపు భద్రతా వ్యవస్థలను అమర్చారు.

కొత్త ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థ, రేర్‌ పార్కింగ్‌ కెమేరాలు, లైవ్‌ ట్రాఫిక్‌ నేవిగేషన్‌, వాహన సమాచారం, స్క్రీన్‌పై అలర్ట్‌లు మరింత మెరుగైన డ్రైవింగ్‌ అనుభూతి ఇస్తాయని తెలిపింది. కొత్త బాలెనోతో బ్రాండ్‌ మరింత బలోపేతం కానుందని కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ కల్సీ పేర్కొన్నారు. 

click me!