ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి వచ్చేసింది.. టాప్ స్పీడ్, మైలేజ్ అదుర్స్..

By asianet news teluguFirst Published Sep 9, 2022, 1:42 PM IST
Highlights

కస్టమర్‌లు డిసెంబర్ 2022లో ఎక్స్‌యూ‌వి400 టెస్ట్ డ్రైవ్‌ తీసుకోవచ్చు. కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర ఇంకా బుకింగ్‌ వచ్చే ఏడాది జనవరిలో ప్రకటించవచ్చని కంపెనీ తెలిపింది. డెలివరీలు కూడా జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
 

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా ఎట్టకేలకు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కార్ ఎక్స్‌యూ‌వి400ని గురువారం సాయంత్రం ఆవిష్కరించింది.  అలాగే త్వరలో భారతీయ మార్కెట్లో కొనుగోలుదారులకు పరిచయం చేయనుంది. మహీంద్రా ఎక్స్‌యూ‌వి400  టాటా నెక్సన్ ఈ‌వి ప్రైమ్, నెక్సన్ ఈ‌వి మ్యాక్స్‌కి పోటీనిస్తుంది. ఎక్స్‌యూ‌వి400 ఎలక్ట్రిక్ కారు మహీంద్రా  ఈఎక్స్‌యూ‌వి300 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు, దీనిని ఆటో ఎక్స్‌పో 2020లో ప్రదర్శించారు. ఇంకా మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌విలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది.  

టెస్ట్ డ్రైవ్ అండ్ బుకింగ్
కస్టమర్‌లు డిసెంబర్ 2022లో ఎక్స్‌యూ‌వి400 టెస్ట్ డ్రైవ్‌ తీసుకోవచ్చు. కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర ఇంకా బుకింగ్‌ వచ్చే ఏడాది జనవరిలో ప్రకటించవచ్చని కంపెనీ తెలిపింది. డెలివరీలు కూడా జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

పవర్ అండ్ స్పీడ్
ఎక్స్‌యూ‌వి400 ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌విలోని PSM ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 147 hp శక్తిని, 310 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూ‌వి400 టాప్ స్పీడ్ 150 kmph. ఇందులో పవర్ డెలివరీ, స్టీరింగ్ ఎక్స్పిరియన్స్ మార్చే మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి 8.3 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకోగలదు. 

బ్యాటరీ ప్యాక్
ఎక్స్‌యూ‌వి400 ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి బ్యాటరీ సామర్థ్యం 39.4 kWh, బ్యాటరీ ప్యాక్ IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ కూడా. బ్యాటరీ కోసం చిల్లర్ అండ్ హీటర్ కూడా ఉన్నాయి. ఈ బ్యాటరీని ఇండియాలో తయారు చేసారు. 

డ్రైవింగ్ రేంజ్
మహీంద్రా ఎక్స్‌యూ‌వి400 ఇండియన్ డ్రైవింగ్ సైకిల్ (MIDC) ప్రకారం 456 కి.మీ. మహీంద్రా వన్ పెడల్ డ్రైవింగ్‌ను కూడా అందిస్తోంది, తద్వారా డ్రైవర్ యాక్సిలరేటర్‌ను ఆఫ్ చేసినప్పుడు కార్ బ్రేకింగ్‌ను ప్రారంభించి ఆటోమేటిక్ గా  ఎలక్ట్రిక్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. 

లుక్ అండ్ డిజైన్
ఎక్స్‌యూ‌వి400 ఎస్‌యూ‌వి రాగితో కూడిన ట్విన్-పీక్ లోగోతో వస్తుంది. మహీంద్రా  ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వికి కాపర్ ట్విన్స్-పీక్ లోగో ఉంటుంది, దీనిని మొదటిసారిగా ఎక్స్‌యూ‌వి400లో ఇచ్చారు. ఎక్స్‌యూ‌వి400 ఎక్స్‌యూ‌వి300ని పోలి ఉంటుంది కానీ విభిన్న ఎల్‌ఈ‌డి టెయిల్ ల్యాంప్‌లు, ఎక్కువ పొడవు, అప్‌డేట్ చేసిన ఫ్రంట్ అండ్ కొత్త గ్రిల్‌తో వస్తుంది. 

సైజ్  పరంగా ఎక్స్‌యూ‌వి400 పొడవు 4,200ఎం‌ఎం, వెడల్పు 1,821ఎం‌ఎం, ఎత్తు 1,634ఎం‌ఎం, 2,600ఎం‌ఎం వీల్‌బేస్‌,  378 లీటర్ల బూట్ స్పేస్ పొందుతుంది, అంటే ఎక్స్‌యూ‌వి300తో సమానంగా ఉంటుంది. 

click me!