బి‌ఎం‌డబల్యూ కొత్త ఎడిషన్: ఇండియాలోకి కూపే ఎస్‌యూ‌వి.. లిమిటెడ్ కార్లు మాత్రమే...

By asianet news teluguFirst Published Sep 9, 2022, 12:53 PM IST
Highlights

బి‌ఎండబల్యూ  'ఎక్స్'  రేంజ్ లో ఎస్‌యూ‌విలు, కూపే ఎస్‌యూ‌విలు ఉన్నాయి. ఎక్స్4 అనేది కూపే ఎస్‌యూ‌వి, ఈ కార్ ఎక్స్3 ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది. అయితే కంపెనీ '50 జహ్రే ఎం ఎడిషన్'ను లిమిటెడ్ సంఖ్యలో తీసుకువస్తుందని భావిస్తున్నారు.  
 


లగ్జరీ కార్ బ్రాండ్ బి‌ఎం‌డబల్యూ ఇండియా  బి‌ఎం‌డబల్యూ ఎక్స్4 50 ఎం ఎడిషన్ ని ఇండియన్ మార్కెట్లోకి రూ. 72,90,000 (ఎక్స్-షోరూమ్) ధరకు లాంచ్ చేసింది. అయితే 30డి వేరియంట్ ధర  రూ.74,90,000 (ఎక్స్-షోరూమ్). బి‌ఎం‌డబల్యూ ఎం డివిజన్ 50వ వార్షికోత్సవాన్నిసెలెబ్రేట్  చేసుకునేందుకు 50 జహ్రే ఎం ఎడిషన్ ని ఇండియాలోకి ప్రవేశపెట్టింది. అయితే కంపెనీ '50 జహ్రే ఎం ఎడిషన్'ను లిమిటెడ్ సంఖ్యలో తీసుకువస్తుందని భావిస్తున్నారు.  

లుక్ అండ్ డిజైన్‌లో స్పెషల్ ఏమిటంటే
బి‌ఎండబల్యూ  'ఎక్స్'  రేంజ్ లో ఎస్‌యూ‌విలు, కూపే ఎస్‌యూ‌విలు ఉన్నాయి. ఎక్స్4 అనేది కూపే ఎస్‌యూ‌వి, ఈ కార్ ఎక్స్3 ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది.ఎక్స్4 క్లాసిక్ 'బి‌ఎం‌డబల్యూ మోటార్‌స్పోర్ట్' లోగో నుండి ప్రేరణ పొందిన '50 ఇయర్స్ ఆఫ్ ఎం' డోర్ ప్రొజెక్టర్‌తో వస్తుంది. బి‌ఎం‌డబల్యూ గ్రిల్, ఫ్రేమ్ ఇప్పుడు నలుపు రంగులో ఇచ్చారు.

అడాప్టివ్ హెడ్‌ల్యాంప్‌లు ఇప్పుడు 10 ఎం‌ఎం సన్నగా ఉంటుంది. బ్లాక్ యాక్సెంట్స్ అండ్ మ్యాట్రిక్స్ ఫంక్షన్‌తో స్టాండర్డ్‌గా వస్తాయి. ఎస్‌యూ‌వికి ఎం ఏరోడైనమిక్ ప్యాకేజీ  ఇచ్చారు, కాబట్టి ఫ్రంట్ ఆప్రాన్, బ్యాక్ ఆప్రాన్, సైడ్ సిల్ కవర్ కలర్ బడి కలర్ లాగానే ఉంటుంది. సాధారణంగా క్రోమ్‌లో ఉండే విండో బెల్ట్ లైన్ కూడా బ్లాక్ కలర్‌లో ఇచ్చారు.

కారు సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే కొత్త 20-అంగుళాల అల్లాయ్ వీల్స్ జెట్ బ్లాక్ కలర్‌లో ఉంటాయి. బ్రేక్ కాలిపర్‌ల కలర్ రెడ్ హై గ్లోస్ ఉంటుంది. కస్టమర్లు మోటార్‌స్పోర్ట్ ప్యాకేజీ ఇంకా కార్బన్ ప్యాకేజీని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.


ఇంజిన్ అండ్ పవర్
  బి‌ఎం‌డబల్యూ ఎక్స్4 50 ఎం ఎడిషన్  రెండు ఇంజన్ ఆప్షన్స్ తో అందిస్తున్నారు. 3.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఇంకా 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. రెండు ఇంజన్లు ట్విన్-టర్బోచార్జ్డ్, 8-స్పీడ్ ఆటోమేటిక్  గేర్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 252 హెచ్‌పి పవర్, 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ గరిష్టంగా 265 hp శక్తిని, 620 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇంటీరియర్
ఇంటీరియర్ గురించి చెప్పాలంటే దీనికి స్పోర్ట్స్ సీట్లు, ఎం హెడ్‌లైనర్ ఆంత్రాసైట్ అండ్ లెదర్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇంకా మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. 

click me!