rules break: ట్రాఫిక్ ఉల్లంఘనలతో రూ. 1899 కోట్ల చలాన్.. ఈ జాబితాలో అగ్రస్థానంలో దేశ రాజధాని..

By asianet news telugu  |  First Published Mar 25, 2022, 5:29 PM IST

నితిన్ గడ్కరీ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత ఏడాది ఢిల్లీలో 71,89,824 చలాన్లు జారీ చేయబడ్డాయి. దేశ రాజధాని తర్వాత తమిళనాడు 36,26,037 చలాన్లతో రెండో స్థానంలో నిలవగా, గతేడాది కేరళ 17,41,932 చలాన్లతో మూడో స్థానంలో నిలిచింది.


ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు భారతీయులు 2021లో రూ. 1,899 కోట్ల రూపాయల ట్రాఫిక్ చలాన్‌లు చెల్లించారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత ఏడాది దేశవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలపై మొత్తం 1.98 కోట్ల ట్రాఫిక్ చలాన్లు జారీ చేసినట్లు  తెలిపారు. ఈ చలాన్లలో 35 శాతానికి పైగా ఢిల్లీలో జారీ చేయబడ్డాయి, ఇంకా అన్ని రాష్ట్రాల కంటే అత్యధికం. 

నితిన్ గడ్కరీ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత ఏడాది ఢిల్లీలో 71,89,824 చలాన్లు జారీ చేయబడ్డాయి. దేశ రాజధాని తర్వాత తమిళనాడు 36,26,037 చలాన్లతో రెండో స్థానంలో నిలవగా, గతేడాది కేరళ 17,41,932 చలాన్లతో మూడో స్థానంలో నిలిచింది. ప్రభుత్వ కేంద్రీకృత డేటాబేస్ ప్రకారం, 1.98 కోట్ల చలాన్‌లలో, 2021లో రోడ్ రేజ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ కేసులు రెండు లక్షలకు పైగా నమోదయ్యాయి. 

Latest Videos

undefined

ఈ సంవత్సరం ప్రయాణికులకు అంత అనుకూలంగా లేదు. జనవరి 1 నుంచి 15 మార్చి 2022 మధ్య దేశవ్యాప్తంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి అధికారులు ఇప్పటికే రూ.417 కోట్ల విలువైన 40 లక్షల చలాన్‌లను జారీ చేశారు. 

2017, 2019 మధ్య కొత్త మోటారు వాహనాల చట్టం కింద ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య 1,38,72,098 అని నితిన్ గడ్కరీ చెప్పారు. మోటారు వాహనాల చట్టం, 2019 అమలు తర్వాత కేసుల సంఖ్య 4,85,18,314కి చేరుకుంది. 

కొత్త బిల్లును 5 ఆగస్టు 2019న పార్లమెంటు ఆమోదించింది.  ఈ బిల్లు రహదారి భద్రతను మెరుగుపరచడం, డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేయడం, ఉల్లంఘనలకు కఠినమైన జరిమానాలు విధించడం వంటి ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 9 ఆగస్టు 2019న బిల్లుకు ఆమోదం తెలిపారు. 

విద్య, ఇంజనీరింగ్ (road and vehicle both), ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్  అత్యవసర సంరక్షణ ఆధారంగా రహదారి భద్రత సమస్యను పరిష్కరించడానికి తమ మంత్రిత్వ శాఖ మల్టీ వ్యూహాన్ని రూపొందించిందని నితిన్ గడ్కరీ చెప్పారు.
 

click me!