విపణిలోకి హ్యుండాయ్ ‘గ్రాండ్ ఐ10 నియోస్’

By narsimha lode  |  First Published Feb 27, 2020, 1:06 PM IST

దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ విపణిలోకి ‘గ్రాండ్ ఐ10 నియోన్’ పెట్రోల్ వేరియంట్ కారును విపణిలోకి విడుదల చేసింది


దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ విపణిలోకి ‘గ్రాండ్ ఐ10 నియోన్’ పెట్రోల్ వేరియంట్ కారును విపణిలోకి విడుదల చేసింది. బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ కారు ధర రూ.7.68 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

1.0 లీటర్ టర్బో ఇంజిన్‌తో వినియోగదారుల ముంగట్లోకి వస్తున్న ఈ కారు సింగిల్ టోన్, డ్యుయల్ టోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. డ్యూయల్ టోన్ మోడల్ కారు ధర రూ.7.73 లక్షలుగా హ్యుండాయ్ మోటార్స్ నిర్ణయించింది. 

Latest Videos

‘గ్రాండ్ ఐ10 నియోన్’ డ్యూయల్ టోన్ మోడల్ ఫెయిరీ రెడ్, బ్లాక్ రూఫ్, పొరాల్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుందని హ్యుండాయ్ తెలిపింది. ఈ కారు గరిష్ఠంగా 6000 ఆర్పీఎం సామర్థ్యంతో 17.5 కేజీఎం టార్చ్ ఉత్పత్తిని చేస్తుంది. దీనికి 998 సీసీ ఇంజిన్ అమర్చారు. 

Also read:ఇండో- అమెరికా ట్రేడ్ డీల్ కు డోర్స్ క్లోజ్! ఇవీ కారణాలు!!

ప్రస్తుతం మార్కెట్లోకి విడుదలైన రెండు మోడల్ కార్లలోనూ మాన్యువల్ గేర్ బాక్స్ అందిస్తోంది హ్యుండాయ్ మోటార్స్. ఈ కారుకు ముందు భాగంలో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 15 అంగుళాల డైమండ్ అల్లాయ్ వీల్స్, వైర్ లెస్ ఫోన్ చార్జర్, యూఎస్బీ చార్జింగ్ తదితర వసతుల్ని అందిస్తున్నారు. 

హ్యుండాయ్ మోటార్స్ ఇండియా సేల్స్ మార్కెటింగ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ గ్రాండ్ నియోన్ మంచి పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ కారును యంగర్ అర్బన్ ప్రోగ్రెసివ్ కొనుగోలు దారుల కోసం డెవలప్ చేశామని తెలిపారు.

పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, బయో ఇంధనం వేరియంట్లలో లభిస్తుంది. 1.0 లీటర్ టర్బో జీడీఐ ఇంజిన్‌తో గ్రాండ్ ఐ10 నియోస్ స్పోర్ట్జ్ వేరియంట్ కారు అందుబాటులో ఉంది. 

click me!