హ్యుండాయ్ సరికొత్త సెడాన్ ‘అరా’...వ్యక్తిగత వినియోగదారులే టార్గెట్

By Sandra Ashok Kumar  |  First Published Nov 13, 2019, 10:26 AM IST

దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ మోటార్స్ భారత విపణిలోకి న్యూ కంపాక్ట్ సెడాన్ కారు ‘అవురా’ను త్వరలో విడుదల చేయనున్నది. కంపాక్ట్ సెడాన్ కారు ‘ఎక్సెంట్’ మోడల్ కారుకు దీన్ని అప్ డేట్ అని చెబుతున్నారు. 
 


చెన్నై: దేశంలో రెండో అతిపెద్ద కార్ల విక్రయ కంపెనీ, దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మోటార్స్ అనుబంధ హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) మరో కొత్త కారును ప్రవేశపెట్టనుంది. 

ఈ సెడాన్‌ మోడల్‌ను ‘అవురా’ అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కానీ ఆ కారు పూర్తి వివరాలు బయటపెట్టలేదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సబ్ కంపాక్ట్ సెడాన్‌ ‘ఎక్సెంట్’ మోడల్ కారుకు దీన్ని అప్‌గ్రేడ్‍గా భావిస్తున్నారు.

Latest Videos

ఈ కారుకు సంబంధించిన పలు నమూనా కార్లను ఇప్పటికే భారతదేశ రోడ్లపై పరీక్షించారు. హ్యుండాయ్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ ‘ఆధునికత, సౌకర్యాలు, భద్రత, స్టైల్, టెక్నాలజీ సమ్మేళనంగా ఈ ‘అవురా’ కారును తీసుకొస్తున్నాం’ అని చెప్పారు.

aslo read  2019లో ఎన్నికైన మోస్ట్ బ్యూటీఫుల్ బైక్‌...ఏదో తెలుసా...

ఎంతదూరమైనా ప్రయాణిస్తామనే విశ్వాసం, సానుకూల ద్రుక్పథకం ప్రతిబింబించేలా ఈ మోడల్ కారుకు ‘అవురా’ అని పేరు పెట్టినట్లు హ్యుండాయ్ మోటార్స్ తెలిపింది. ప్రస్తుతం హ్యుండాయ్‌ మోటార్స్ భారత్‌లో 12 మోడళ్లను విక్రయిస్తోంది.

అత్యంత ఉన్నతమైన దానికంటే మెరుగైన సేవలను భారతీయ వినియోగ దారులకు అందించేలా ‘అవురా’ మోడల్ కారును డిజైన్ చేసినట్లు పేర్కొంది.అందులో గ్రాండ్‌ ఐ10 నియోస్ మోడల్ కారును ఈమధ్యే మార్కెట్లో ఆవిష్కరించింది.

చెన్నైకి సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లో కంపెనీకి కార్ల ఉత్పత్తి ప్లాంట్‌ ఉంది. ఇక్కడి నుంచి భారత మార్కెట్‌కు అవసరమైన కార్లను సరఫరా చేయడంతోపాటు 91 దేశాలకు ఎగుమతి కూడా చేస్తోంది.

ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎక్సెంట్ మోడల్ కారును ట్యాక్సీ సేవలకు అనుగుణంగా విక్రయాలు సాగిస్తోంది హ్యుండాయ్ మోటార్స్. సరికొత్త ‘అవురా’ మోడల్ కారును మాత్రం ప్రైవేట్, వ్యక్తిగత వినియోగదారుల అవసరాలను లక్షంగా చేసుకుని రూపొందించింది.

ఈ కారులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్మార్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

aslo read ఆఫ్ రోడ్ బైక్ రేసర్స్ కోసం ఇండియన్ ఎఫ్టీఆర్ 1200 ర్యాలీ...

అవురా మోడల్ కారులో గ్రాండ్ ఐ10 నియోస్ కారులో మాదిరిగా 8.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్ లభిస్తాయి. ఇంకా ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఎల్ఈడీ స్ట్రిప్స్, ఎల్ఈడీ డేటైం రన్నింగ్ ల్యాంప్స్ తదితర ఫీచర్లు జోడించారు. హ్యుండాయ్ అవురా మోడల్ కారు సంస్థతోపాటు ఇతర సంస్థలు విక్రయిస్తున్న మోస్ట్ స్టైలిష్ కంపాక్ట్ సెడాన్ కార్లలో ఒకటి కానున్నది.

హ్యుండాయ్ అవురా కారు పూర్తిగా బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్నది. 1.2 లీటర్ల కప్పా పెట్రోల్ ఇంజిన్, యూ2 1.2 లీటర్ల డీజిల్ మోటర్‌తోపాటు మాన్యువల్ గేర్ బాక్స్ విత్ ఎఎంటీ ఆప్షన్ కలిగి ఉంటుంది.

హ్యుండాయ్ అవురా కారు త్వరలో విపణిలో అడుగు పెట్టనున్నది. అయితే ఇప్పటికే మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, ఫోర్డ్ అస్పైర్, టాటా టిగోర్ వంటి మోడల్ కార్లతోపాటు రెనాల్ట్ విడుదల చేయనున్న ఎల్బీఏ కంపాక్ట్ సెడాన్ కారుకు గట్టి పోటీ ఇవ్వనున్నది.  
 

click me!