ఈ మూడు కార్లు ఇండియన్ మార్కెట్ నుండి ఔట్.. ఆ కారణాల వల్ల కంపెనీ నిర్ణయం..

By asianet news telugu  |  First Published Apr 5, 2023, 12:39 PM IST

ఒకప్పుడు హోండా WR-V, జాజ్ రెండూ సక్సెస్ ఫుల్ మోడల్‌లుగా పరిగణించబడుతుండే. భారతీయ కార్ మార్కెట్లో  హోండా WR-V 2017లో ప్రారంభించారు. దీనిని ప్రీమియం అర్బన్ సబ్‌ కాంపాక్ట్ క్రాస్‌ఓవర్ SUVగా ఉంచారు. 


భారతదేశంలోని హోండా కంపెనీ అఫిషియల్ ప్రాడక్ట్ పోర్ట్‌ఫోలియో లిస్ట్ నుండి హోండా WR-V, హోండా జాజ్ అండ్ నాల్గవ జనరేషన్ హోండా సిటీ తొలగించబడ్డాయి. దీనిపై చాలా కాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. జపనీస్ కార్‌మేకర్ హోండా ఇప్పుడు ఈ సంవత్సరం చివర్లో ఒక మిడ్-సైజ్ SUVని విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతోంది. ఈ మోడల్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హారియర్, వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ ఇంకా ఇతర కార్లకు పోటీగా వస్తుంది.

ఒకప్పుడు హోండా WR-V, జాజ్ రెండూ సక్సెస్ ఫుల్ మోడల్‌లుగా పరిగణించబడుతుండే. భారతీయ కార్ మార్కెట్లో  హోండా WR-V 2017లో ప్రారంభించారు. దీనిని ప్రీమియం అర్బన్ సబ్‌ కాంపాక్ట్ క్రాస్‌ఓవర్ SUVగా ఉంచారు. దాదాపు రూ. 9 లక్షల నుండి రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఈ కారు ధర ఉంటుంది, ఇంకా ఇక్కడ ఉన్న సబ్‌కాంపాక్ట్ SUVలకు గట్టి పోటీని ఇస్తుంది. 

Latest Videos

undefined

మరోవైపు, హోండా జాజ్ మొదట 2009లో వచ్చింది. గ్లోబల్ మార్కెట్లలో హోండా ఫిట్ అని పిలవబడే జాజ్ మంచి క్యాబిన్ ఫినిషింగ్‌తో కూడిన విశాలమైన కారుగా గొప్ప ఆదరణ పొందింది. దీనికి అనేక ఫీచర్లు, స్టైలింగ్ అప్‌డేట్‌లు ఇచ్చారుఇంకా WR-V లాగానే దీని ధర ఉంటుంది.

కానీ సబ్-కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో ఎన్నో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం హోండాను దెబ్బతీసింది. దీంతో WR-V, జాజ్ రెండూ డిమాండ్ తగ్గుముఖం పట్టాయి, అయినప్పటికీ రెండు మోడల్‌లు పోటీ ధరతో ఉన్నాయి. అంతేకాదు సివిక్, BR-V, CR-V ఇప్పటికే నిలిపివేయబడ్డాయి. 

ప్రస్తుతం, కంపెనీ భారతీయ పోర్ట్‌ఫోలియోలో 5th జనరేషన్ హోండా సిటీ మాత్రమే ఉంది - దీనిని ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ చేశారు. అయితే చాలా కాలంగా ఎదురుచూస్తున్న మిడ్-సైజ్ SUV మోడల్‌పై అందరి దృష్టి ఉంది. 
 

click me!