బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కొత్త XPulse 200 4V ర్యాలీ ఎడిషన్ బైక్‌ను కస్టమర్లకు అందజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇప్పటివరకు కస్టమర్లకు తొలి 100 యూనిట్లను డెలివరీ చేసినట్లు తెలిపింది.
హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లో ఎక్స్ పల్స్ 200 4V ర్యాలీ ఎడిషన్‌ను లాంచ్ చేసిన దాదాపు ఒక నెల తర్వాత బైక్ డెలివరీలను ప్రారంభించింది. బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కొత్త XPulse 200 4V ర్యాలీ ఎడిషన్ బైక్‌ను కస్టమర్లకు అందజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇప్పటివరకు కస్టమర్లకు తొలి 100 యూనిట్లను డెలివరీ చేసినట్లు తెలిపింది. భారతదేశంలో ద్విచక్ర వాహన తయారీ సంస్థ మొట్టమొదటి ఎక్స్‌పల్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆఫ్-రోడర్ బైక్ డెలివరీ చేసింది. హీరో మోటోకార్ప్ త్వరలో ఇలాంటి మరిన్ని కేంద్రాలను భారతదేశం అంతటా ప్రారంభించనుంది.
కొత్త హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.52 లక్షలు. Hero MotoSports ర్యాలీ బైక్ నుండి ప్రేరణ పొందిన ఈ ADV బెటర్ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాల కోసం ఫ్యాక్టరీ అమర్చిన ర్యాలీ కిట్ పొందుతుంది. DRLతో కూడిన LED హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ పొందుతుంది.
undefined
ఇంజిన్ అండ్ ఫీచర్లు
హీరో Xpulse 200 4V ర్యాలీ ఎడిషన్ 199.6cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్, 4-స్ట్రోక్, 4-వాల్వ్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజన్ 18.9 bhp శక్తిని, 17.35 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఇచ్చారు.
సీట్ ఎత్తు 885 ఎంఎం, హ్యాండిల్‌బార్ రైసర్ 40 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 270 ఎంఎం, వీల్‌బేస్ 1426 ఎంఎం, బెటర్ ఆఫ్-రోడింగ్ కోసం బైక్ మెరుగైన రైడింగ్ డైనమిక్‌లను పొందుతుంది. ఎక్స్ టెండెడ్ గేర్ లివర్, 21-అంగుళాల ఫ్రంట్ అండ్ 18-అంగుళాల బ్యాక్ స్పోక్ వీల్స్‌తో డ్యూయల్-పర్పస్ టైర్‌లను పొందుతుంది.
హీరో మోటోకార్ప్ ద్వారా ఎక్స్‌పల్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ కస్టమర్లకు శిక్షణా కార్యక్రమాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హీరో మోటోకార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ, “అడ్వెంచర్ బైకింగ్ విభాగంలో అగ్రగామిగా ఉన్న హీరో మోటోకార్ప్ సాహసాలను ఇష్టపడే రైడర్లకు ఆకట్టుకునే ఉత్పత్తులను, కార్యక్రమాలను పరిచయం చేస్తోంది.
శిక్షణా కార్యక్రమంలో పాల్గొనే రైడర్‌లు ఆఫ్-రోడ్ సెటప్, బాడీ పోశ్చర్, బ్రేకింగ్, ఇంక్లైన్ అండ్ డిక్లైన్, బైక్ రికవరీ, బ్యాలెన్స్ పాయింట్, గ్యారేజ్ టర్న్, బ్రేక్ స్లైడ్, బైక్ నడవడం వంటి అవసరమైన ఆఫ్-రోడ్ రైడింగ్ స్కిల్స్ నేర్చుకుంటారు.