విద్యుత్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్రం పలు రాయితీలు ప్రకటిస్తోంది. పన్ను రాయితీలతోపాటు రూ.50 వేల వరకు రిబేల్ అందిస్తోంది.
మీరు విద్యుత్ వాహనాన్ని కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అవునంటే మీ కోసం ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ రెడీగా ఉంది. విద్యుత్ వాహనాల కొనుగోలుదారులు కొంత సొమ్ము ఆదా చేసుకోవచ్చు. పర్యావరణ అనుకూల వాహనాన్ని కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం రూ.50 వేల వరకు వివిధ రూపాల్లో రాయితీలు అందుబాటులోకి తేనున్నదని అధికార వర్గాల కథనం.
ప్రస్తుతం స్టాండర్డ్ వేరియంట్ వాహనాల కంటే విద్యుత్ వాహనాల వ్యయం రెండు నుంచి రెండున్నర రెట్లు ఎక్కువ. అటువంటి వాహనాల కోసం ప్రతి దశలోనూ అవసరమైన చార్జింగ్ స్టేషన్ల వంటి మౌలిక వసతుల కల్పనపైనా ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఒక ఆంగ్ల దిన పత్రికల్లో వచ్చిన సమాచారం మేరకు విద్యుత్ వాహనాల కోసం వినియోగదారులు తీసుకునే రుణాలపై వడ్డీరేటు తగ్గింపు కల్పిస్తోంది. తద్వారా వినియోగదారులు అత్యధికంగా వాహనాలను కొనుగోలు చేసేలా సర్కార్ ప్రోత్సహిస్తోంది.
ఒక సీనియర్ ప్రభుత్వాధికారి అంచనా మేరకు విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసే విషయమై వినియోగదారులకు సరిపడా ఇన్సెంటివ్‌లను అందజేయనున్నదని సమాచారం. ప్రస్తుత కన్వెన్షనల్ ఇంటర్నల్ కంబుషన్ ఇంజిన్ స్థానే విద్యుత్ వాహనాలకు మ్యాచ్ అయ్యే వాటికి ఇంజిన్లు వాడే వాహనాలకు సంప్రదాయ వాహనాలతో పోలిస్తే రాయితీలు అందుబాటులో ఉన్నాయి.
తొలిదశలో విద్యుత్ వాహనాల కొనుగోలుపై అందజేసే ఇన్సెంటివ్‌లను ప్రభుత్వం ఎంపిక చేసిన నగరాలకు పరిమితం చేయొచ్చు. ప్రస్తుతానికి విద్యుత్ వాహనాలను నడిపించేందుకు అవసరమైన సరిపడా మౌలిక వసతులు మనదేశంలో లేవు మరి. విద్యుత్ వాహనాలకు ప్రజాదరణ తీసుకొచ్చేందుకు పార్కింగ్ చార్జీల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయింపు కల్పిస్తాయని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి ఆ వాహనాలను కొనుగోలు చేసేవారికి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రానున్నాయి. ప్రస్తుతానికి త్వరలో భారతదేశ మార్కెట్లోకి హ్యుండాయ్ కొనా, నిస్సాన్ లీఫ్, ఆడి - ఈ ట్రోన్ మోడల్ కార్లు విద్యుత్ వాహనాలుగా నిలుస్తాయి.