కరోనా కష్టాలు.. వేతనాల్లో జనరల్ మోటార్స్‌ 20 శాతం కోత

By telugu news teamFirst Published Mar 28, 2020, 3:28 PM IST
Highlights

అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ సిబ్బంది వేతనాల్లో 20 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటి వద్ద నుంచి పని చేసే వారికీ ఇది వర్తిస్తుంది. ఎగ్జిక్యూటివ్‌లు మరో ఐదు నుంచి 10 శాతం, బోర్డు డైరెక్టర్లు 20 శాతం అదనంగా వేతనాల్లో కోత విధించుకున్నారు. 

అమెరికాలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘జనరల్ మోటార్స్’ కరోనా వైరస్ ప్రభావంతో విలవిల్లాడుతోంది. సిబ్బంది వేతనాల చెల్లింపుపై తకరారు చేస్తోంది. 69 వేల మంది ఉద్యోగులు జనరల్ మోటార్స్ సంస్థలో పని చేస్తున్నారు.  వారందరికీ 20 శాతం వేతనాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. 

వైరస్ రాక ముందు సంస్థ బిజినెస్ సమర్థవంతంగా ఉందని జనరల్ మోటార్స్ చెబుతోంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వారికి 20 శాతం వేతనం తగ్గిస్తామని అంటున్నది. కరోనా వైరస్ వల్ల అంతర్జాతీయంగా వవిధ దేశాల్లోని ప్రొడక్షన్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేసింది జనరల్ మోటార్స్. 

కరోనా వైరస్ వల్ల సంక్షోభం తీవ్రమైతే ఉద్యోగుల సేవలను జనరల్ మోటార్స్ నిలిపివేస్తుంది. ఈ మేరకు వారికి వేతనాల చెల్లింపులు ఉండవు. అయితే 2021 మార్చి 15వ తేదీలోపు వారికి వడ్డీతో చెల్లిస్తామని హామీ ఇస్తోంది. 

వేతన చెల్లింపుల్లో కోత విధించడం ‘వర్క్ ఫ్రం హోం’ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని జనరల్ మోటార్స్ తెలిపింది. అమెరికాలో సుమారు 6,500 మంది ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేయడం లేదు. వారు పెయిడ్ లీవ్‌లో ఉన్నారు. ఇది ’శాలరీస్ డౌన్ టైమ్ పెయిడ్ అబ్సెన్స్’ అని జనరల్ మోటార్స్ పిలుస్తోంది. వీరు 75 శాతం వేతనం చెల్లిస్తామని, వారికి హెల్త్ బెనిఫిట్లు అందిస్తోంది. 

ఉద్యోగులకు 20 శాతం వేతనాల కోత విధిస్తే, ఎగ్జిక్యూటివ్‌లు మరో ఐదు, 10 శాతం వేతనాలను తగ్గించుకుంటారు. బోనస్‌లు, ఇతర ఇన్సెంటివ్‌ల్లో కోత విధించుకుంటున్నారు. జనరల్ మోటార్స్ డైరెక్టర్ల బోర్డు సభ్యులు అదనంగా మరో 20 శాతం వేతనం తగ్గించుకుంటున్నారు. సంస్థలో టాప్ ఎగ్జిక్యూటివ్‌లు 300 మంది ఉన్నారు. వారి వేతనాల్లో 20-50 శాతం వరకు వేతనాల్లో కోత పడుతోంది. 
 

click me!