సరికొత్త హోండా ఎస్‌యూవీ కార్ బుకింగ్స్ ఓపెన్.. జస్ట్ రూ. 21వేలకి కారును ఇంటికి తీసుకెళ్ళండి!

By asianet news teluguFirst Published Jul 12, 2023, 12:03 PM IST
Highlights

హోండా కొత్త డిజైన్,  పర్ఫార్మెన్స్  SUV ఎలివేట్ బుకింగ్‌లను తాజాగా ప్రారంభించింది. ఇది హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి వాటికి పోటీగా ఉండే మిడ్-సైజ్ SUV. అయితే కేవలం రూ.21వేలతో కొత్త కారును బుక్ చేసుకోవచ్చు.
 

న్యూఢిల్లీ: భారత్‌లో ఎస్‌యూవీ కార్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. దింతో ఆటోమొబైల్ కంపెనీలన్నీ కొత్త SUV కార్లను విడుదల చేస్తున్నాయి. హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ వంటి మిడ్-సైజ్ SUV లకు పోటీగా హోండా సరికొత్త కారు ఎలివేట్‌ని  ఆవిష్కరించింది. ఇంకా ఈ కొత్త కారు బుకింగ్ కూడా మొదలైంది. హోండా ఎలివేట్ SUV కారును బుక్ చేసుకోవడానికి 21,000 రూపాయలు సరిపోతుంది. 

హోండా ఎలివేట్ సెప్టెంబర్ నెలలో భారతదేశంలో ప్రారంభించబడుతుంది. బుక్ చేసుకున్న కస్టమర్లకు అదే నెల నుంచి కారు డెలివరీ అందిస్తారు. కొత్త హోండా ఎలివేట్‌లో i-VTEC DOHC 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇచ్చారు. ఇది 121PS పవర్, 145Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి  6-స్పీడ్ మాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్, 7-స్పీడ్ CVT ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్ అప్షన్ ఉంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కారు SV, V, VX, ZX అనే నాలుగు వేరియంట్‌లలో లభిస్తుండగా, ఆటోమేటిక్ కారు V, VX ఇంకా ZX వేరియంట్‌లలో లభిస్తుంది.

సరికొత్త హోండా ఎలివేట్ SUV ధర రూ. 10.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి టాప్ ఎండ్  రూ. 18 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కొత్త హోండా ఎలివేట్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్‌లకు పోటీగా ఉంటుంది. 

హోండా ఎలివేట్‌లో ఫుల్ LED ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉన్నాయి. LED DRLలు, LED టర్న్ ఇండికేటర్లు, LED టెయిల్‌ల్యాంప్స్, 17-అంగుళాల డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో 7 అంగుళాల హెచ్‌డి టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల ఐపిఎస్ హెచ్‌డి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, 458 లీటర్ బూట్ స్పేస్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. 

అంతేకాదు సేఫ్టీ ఫీచర్లపై చాలా శ్రద్ధ పెట్టారు. హోండా ఎలివేట్ కారు ADAS టెక్నాలజీ ఉంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ వాచ్ కెమెరా, స్టెబిలిటీ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఎల్‌టి యాంగిల్ రేర్ వ్యూ, రేర్ పార్కింగ్ సెన్సార్ వంటి తప్పనిసరి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.  

click me!