Bajaj Electric Scooter: 20 నగరాల్లో బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బుకింగ్స్ ఓపెన్..!

By team telugu  |  First Published Feb 21, 2022, 1:13 PM IST

దేశంలో ఇందన ధరలు పెరిగిపోవడంతో అందరి దృష్టి ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. ఎలక్ట్రిక్ వాహనాలకు రానురాను ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థలు కూడా ఈవీ వాహనాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాయి.


దేశంలో ఇందన ధరలు పెరిగిపోవడంతో అందరి దృష్టి ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. ఎలక్ట్రిక్ వాహనాలకు రానురాను ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థలు కూడా ఈవీ వాహనాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ Bajaj Auto కూడా బైక్, స్కూటర్లలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తోంది. ఇప్పటికే తమ పోర్ట్‌ఫోలియోలోని బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఈవీ చేతక్ స్కూటర్లకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే పలు నగరాల్లో ఈవీ స్కూటర్లను విస్తరించిన కంపెనీ కొత్తగా మరో మూడు ప్రధాన నగరాల్లో Bajaj Chetak electric scooter ప్రవేశపెడుతోంది. ఇందులోభాగంగానే ఢిల్లీ, గోవా ప్రాంతాల్లో బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ (Bajaj Chetak electric scooter Bookings) ప్రారంభమయ్యాయి.

ఇప్పటివరకు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 20 నగరాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మరో 12 కొత్త నగరాలను చేర్చిన బజాజ్ బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. ఆరు వారాల్లోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ రెట్టింపు స్థాయిలో పదుల సంఖ్యలో నగరాల్లోకి ఈవీ స్కూటర్లను ప్రవేశపెట్టింది. 2022లో మొదటి ఆరు వారాల్లోనే అదనంగా మరో 12 నగరాల్లో ఈవీ స్కూటర్లను ప్రవేశపెట్టి ఈ మైల్ రాయిని చేరుకుంది. ఈ కొత్త నగరాల్లో (Bajaj Chetak electric scooter) బుకింగ్స్ కూడా ప్రారంభమవుతాయని కంపెనీ ధ్రువీకరించింది.

Latest Videos

undefined

కొత్త కొనుగోలుదారులు మరో 4 వారాల నుంచి 8 వారాలు ఎదురుచూడాల్సి ఉంటుంది. కస్టమర్లు ఎవరైనా ఆన్ లైన్ ఈవీ స్కూటర్ బుకింగ్ కోసం www.chetak.com వెబ్ సైట్ సందర్శించవచ్చు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ మొత్తం 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 149,350 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈవీ స్కూటర్లురెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. అందులో అర్బన్ , ప్రీమియం వేరియంట్లుగా ఉన్నాయి. మార్కెట్లో ఎంట్రీ లెవల్ అర్బన్ వేరియంట్ ధర రూ. 1.42 లక్షలు ఉండగా.. ప్రీమియం వేరియంట్ ధర రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే)గా ఉంది.

కంపెనీ సమాచారం ప్రకారం.. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ముంబై, న్యూఢిల్లీ, గోవా, మదురై, కోయంబత్తూర్, కొచ్చి, హుబ్లీ, విశాఖపట్నం, నాసిక్, వసాయ్, సూరత్‌ వంటి సిటీల్లో అందుబాటులో ఉన్నాయి. బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ల ఉత్పత్తి కోసం రూ.300 కోట్లు వరకు పెట్టుబడి పెట్టినట్టుగా బజాజ్ ఆటో కంపెనీ ఇదివరకే ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్‌లో బజాజ్ ఆటో.. పుణెలో కూడా కొత్త ఈవీ స్కూటర్ ప్లాంట్ కోసం పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాంట్ కోసం 40మిలియన్ డాలర్లు (రూ.300 కోట్లు) వరకు పెట్టాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆటోమాటివ్ బ్రాండ్ అకుర్ది(Pune)లో ఏర్పాటు చేసిన యూనిట్‌లో స్కూటర్లను తయారుచేస్తోంది.

click me!