ఆడి ఏ8 ఎల్ అత్యున్నత స్థాయి లగ్జరీ, సౌకర్యం అండ్ ఫీచర్లతో వస్తుంది. కొత్త ఆడి ఏ8 ఎన్నో కస్టమైజ్ ప్యాకేజీలు- రిక్లెనర్, ఫుట్ మసాజర్ అండ్ ఇంకా మరెన్నో ఇతర ప్రత్యేక ఫీచర్లతో కూడిన రియర్ రిలాక్సేషన్ ప్యాకేజీతో సహా అందించబడుతుంది.
ముంబై, 05 మే, 2022: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (audi) ఈరోజు ఇండియాలో ప్లాగ్‌షిప్ సెడాన్ కొత్త ఆడి ఏ8 బుకింగ్‌లను ప్రారంభించింది. 3.0ఎల్ టిఎఫ్‌ఎస్ఐ ఇంజిన్, 481 మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్, క్వాట్రో ఆల్- వీల్ డ్రైవ్‌తో కొత్త ఆడి ఏ8 ఉత్తేజకరమైన డ్రైవింగ్ డైనమిక్‌లను అందిస్తుంది. అయితే 10లక్షల ప్రారంభ బుకింగ్ మొత్తంతో ఆడి ఏ8 ఓని బుక్ చేసుకోవచ్చు.
ఆడీ ఇండియా హెడ్ - బల్ఫిర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, “ఈ రోజు మేము మా ప్లాగ్‌షిప్ సెడాన్ - కొత్త ఆడి ఏ8 ఎల్ బుకింగ్‌లను ప్రారంభించాము. ఆడి ఏ8 ఎల్ కోసం ఇండియాలో విశ్వసనీయమైన అభిమానులు ఉన్నారు. ఈ అందమైన సెడాన్ బలమైన పర్ఫర్మేన్స్ కొనసాగిస్తుందని మేము నమ్ముతున్నారు. మేము మంచి డిమాండ్‌ను కొనసాగిస్తున్నందున కొత్త ఆడి ఏ8 ఎల్ తో మా ప్రొడక్షన్ పోర్ట్‌ఫోలియోలో ప్లాగ్‌షిప్ కార్లపై మా దృష్టిని కొనసాగిస్తున్నాము.
undefined
ఆడి ఏ8 ఎల్ అత్యున్నత స్థాయి లగ్జరీ, సౌకర్యం అండ్ ఫీచర్లతో వస్తుంది. కొత్త ఆడి ఏ8 ఎన్నో కస్టమైజ్ ప్యాకేజీలు- రిక్లెనర్, ఫుట్ మసాజర్ అండ్ ఇంకా మరెన్నో ఇతర ప్రత్యేక ఫీచర్లతో కూడిన రియర్ రిలాక్సేషన్ ప్యాకేజీతో సహా అందించబడుతుంది. కస్టమర్‌లు ఇప్పుడు సమీప ఆడి ఇండియా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు లేదా www.audi.inని సందర్శించి వ్యక్తిగతీకరించిన ఆడి ఏ8 ఎల్ ని బుక్ చేసుకోవచ్చు ఇంకా కాన్సిగర్ చేయవచ్చు.
ఆడి గ్రూప్ ప్రీమియం అండ్ లగ్జరీ సెగ్మెంట్లలో ఆటోమొబైల్స్ ఇంకా మోటార్ సైకిళ్ల అత్యంత విజయవంతమైన తయారీదారులలో ఒకటి. దాని బ్రాండ్లు ఆడి, డుకాట్మి, లంబోర్డిని జనవరి ౩, 2022 నుండి బెంట్లీ ఇది ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లోని ప్రీమియం బ్రాండ్ గ్రూప్‌ను కలిగి ఉంది. దీని బ్రాండ్‌లు ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ మార్కెట్‌లలో ఉన్నాయి. ఆడి దాని భాగస్వాములు 13 దేశాలలో 21 ప్రదేశాలలో ఆటోమొబైల్స్ అండ్ బైక్స్ ని ఉత్పత్తి చేస్తున్నారు.
2021లో ఆడి గ్రూప్ ఆడి బ్రాండ్ నుండి దాదాపు 1.681 మిలియన్ కార్లను, లంబోర్టిని బ్రాండ్ నుండి త,405 స్పోర్ట్స్ కార్లను, డుకాటి బ్రాండ్ నుండి 59,447 బైక్స్ ని కష్టమర్లకు డెలివరీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 85వేల కంటే ఎక్కువ మంది ఆడి గ్రూప్ కోసం పని చేస్తున్నారు, వారిలో దాదాపు 60వేల మంది జర్మనీలో ఉన్నారు. ఆకర్షణీయమైన బ్రాండ్‌లు, కొత్త మోడల్‌ల్ కి వినూత్నమైన మొబిలిటీ ఆఫర్‌లు, సంచలనాత్మక సేవలతో ప్రీమియం బ్రాండ్ గ్రూప్ స్థిరమైన, వ్యక్తిగత, ప్రీమియం మొబిలిటీ ప్రొవైడర్‌గా మారడానికి క్రమపద్ధతిలో దాని మార్గాన్ని అనుసరిస్తుంది.