తెలంగాణ ఆర్టీసీ పాక్షిక ప్రైవేటీకరణపై నజర్.. బీఎస్-6లోకి హిందుజాల ఎంట్రీ

By Sandra Ashok Kumar  |  First Published Nov 5, 2019, 11:40 AM IST

బీఎస్-6 ప్రమాణాల జాబితాలోకి భారీ, వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ వచ్చి చేరింది. పలు రకాల వాహనాలను విపణిలోకి విడుదల చేసిన సంస్థ చైర్మన్ ధీరజ్ హిందుజా.. తెలంగాణలో ఆర్టీసీ పాక్షిక ప్రైవేటీకరణపై కేంద్రీకరించామన్నారు.


చెన్నై: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్‌లేలాండ్‌ కూడా భారత్‌ స్టేజ్-6 (బీఎస్‌- 6) ప్రమాణాల బాట పట్టింది. ఆ ప్రమాణాలకు అనుగుణంగా తాజాగా భారీ శ్రేణి వాహనాలను ఆవిష్కరించింది. కస్టమర్ల అవసరాలకు తగిన విధంగా సీట్లు, స్టీరింగ్‌ తదితర ఫీచర్లు అమర్చింది. మాడ్యులర్‌ బిజినెస్‌ ప్రోగ్రామ్‌గా పిలిచే ఈ విధానం టైలర్‌మేడ్‌ తరహాలో ఉంటుందని అశోక్ లేలాండ్ వివరించింది.

మరిన్ని భద్రతా ప్రమాణాలతో రూపొందుతున్న ఈ నూతన తరం వాహనాలు వచ్చే ఏడాది జనవరి నాటికి సిద్దం అవుతాయని అశోక్ లేలాండ్ ప్రకటించింది. ప్రస్తుత ధరల శ్రేణి రూ.12 లక్షల నుంచి రూ.35 లక్షల వరకూ పలుకుతోంది. నూతన మోడల్ వాహనాల విడుదల సమయంలో ధరలను వెల్లడిస్తామని సంస్థ చైర్మన్‌ ధీరజ్‌ హిందుజా అన్నారు.

Latest Videos

undefined

also read మహీంద్రా మ్యాజిక్...ఒక్క నెలలో 2000 యూనిట్ల...అమ్మకాలు

ఈ కామర్స్, పార్సిళ్లకు తగిన ట్రక్కుల నుంచి సిమెంట్‌ను తరలించే వాహనాలతోపాటు డిఫెన్స్, టూరిస్ట్‌ బస్సులను ధీరజ్‌ హిందుజా సోమవారం ఆవిష్కరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల వాహనాల విక్రయాలు నమోదయ్యాయి. 

త్వరలోనే అమ్మకాలను 4 లక్షల యూనిట్లకు పెంచడం ద్వారా ప్రపంచంలోనే టాప్‌–10 స్థానంలోకి చేరనున్నామని అశోక్ లేలాండ్ చైర్మన్ ధీరజ్‌ హిందుజా ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 24వ స్థానంలో ఉన్నట్టు తెలిపారు.

అధునాతన టెక్నాలజీతో కూడిన వాహనాలను విడుదలతో మార్కెట్‌ వాటా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అశోక్ లేలాండ్ చైర్మన్ ధీరజ్‌ హిందుజా తెలిపారు. ఈ టెక్నాలజీ డ్రైవర్లకు స్నేహపూర్వకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉదాహరణకు ఇంజన్‌లో ఎటువంటి లోపం తలెత్తినా వెంటనే డ్రైవర్‌కు సమాచారం వస్తుందన్నారు.  

also read మెర్సిడెస్ బెంజ్ కొత్త వేరియంట్...దీని ధర ఎంతో తెలుసా ?

ఎలక్ట్రిక్‌ బస్సులను ఉత్పత్తి చేయడం కోసం అశోక్ లేలాండ్ ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడులో ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. ప్లాంట్ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆటో పరిశ్రమలో మందగమనం నెలకొనడంతో విస్తరణ పణులను చేపట్టలేకపోతున్నామని అశోక్ లేలాండ్ చైర్మన్ ధీరజ్‌ హిందుజా అన్నారు.

తెలంగాణలో ఆర్టీసీ పాక్షిక ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలిస్తున్నామని అశోక్ లేలాండ్ చైర్మన్ ధీరజ్‌ హిందుజా చెప్పారు. ప్రైవేటు ప్యాసింజర్‌ సంస్థలకు అవసరమైన బస్సులను ప్రస్తుతానికి తాము ఉత్పత్తి చేయడం లేదన్నారు.

click me!