2022 Kawasaki Versys 650: కవాసకి నుంచి మరో బైక్.. ధర తెలిస్తే షాక్ అవ్వ‌క‌ త‌ప్ప‌దు..!

By team teluguFirst Published Jun 28, 2022, 4:45 PM IST
Highlights

కవాసకి తాజాగా Kawasaki Versys 650 పేరుతో మరో సరికొత్త మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 7.36 లక్షలుగా ఉంది.  
 

జపనీస్ బైక్ మేకర్ కవాసకి మరో సరికొత్త మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కవాసకి వెర్సిస్ 650 (Kawasaki Versys 650) పేరుతో విడుదలైన ఈ మోటార్ బైక్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 7.36 లక్షలుగా ఉంది. ఇప్పటికే నింజా 300, నింజా 400 లాంచ్‌ చేసిన కవాసకి ఈ 2022లోనే భారత మార్కెట్లో తమ బ్రాండ్ నుంచి మూడవ మోటార్‌సైకిల్‌గా ఈ కవాసకి వెర్సిస్ 650ను విడుదల చేయడం విశేషం. అయితే ఇది తమ మునుపటి మోడల్ కంటే సుమారు రూ. 21 వేలు ఎక్కువ.

2022 కవాసకి వెర్సిస్ 650 భారత రోడ్లపై ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660 (రూ. 8.95 లక్షలు) హోండా CB500X (రూ. 5.8 లక్షలు) అలాగే సుజుకి V-Strom 650XT (రూ. 8.85 లక్షలు) వంటి వాటితో వాటితో పోటీపడుతుంది. వీటికంటే తక్కువ ధరలో లభించే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 (రూ. 3.15 లక్షలు) కూడా ఈ సెగ్మెంట్లో పోటీలో నిలుస్తుంది. కొత్తగా విడుదలైన బైక్‌లో అప్‌డేట్‌ల విషయానికి వస్తే 2022 కవాసకి వెర్సిస్ 650 దీని ఎగువ శ్రేణి వేరియంట్ అయిన వెర్సిస్ 1000 నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌ను కలిగి ఉంది. అలాగే నాలుగు-దశల సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్‌తో పాటు, సరికొత్త LED హెడ్‌లైట్ యూనిట్ల మినహా బైక్ మొత్తం పాత వెర్షన్ లాగే కనిపిస్తుంది.

ఫీచర్లు- స్పెసిఫికేషన్లు

కవాసకి వెర్సిస్ 650లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను తొలగించి బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సరికొత్త 4.3-అంగుళాల TFT స్క్రీన్‌ను ఇచ్చారు. ప్రత్యేక USB పోర్ట్‌ ఉంది. అలాగే ఇందులో ABSను మాడ్యులేషన్ చేసే డ్యుఎల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇచ్చారు. ఇది కఠిన పరిస్థితులలో కూడా రైడర్‌లకు బైక్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. 

ఇంజన్ విషయానికి వస్తే.. వెర్సిస్ 650లో లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ 650 cc ఇంజిన్‌ అమర్చారు. దీనిని 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ ఇంజన్ 66 Bhp గరిష్ట శక్తిని వద్ద 61 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. బ్రేకింగ్ వ్యవస్థను పరిశీలిస్తే ఫ్రంట్ వీల్ కోసం డ్యూయల్-పిస్టన్ కాలిపర్‌లతో 300 మిమీ పెటల్ డిస్క్‌లు, వెనుకవైపు సింగిల్-పిస్టన్ కాలిపర్‌తో ఒకే 250 మిమీ నాన్-పెటల్డ్ డిస్క్-బ్రేక్ ఇచ్చారు.
2022 వెర్సిస్ 650 ఇప్పుడు లైమ్ గ్రీన్ , మెటాలిక్ ఫాంటమ్ సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్ ఆన్‌లైన్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

click me!