దూసుకొస్తున్న డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4.. వచ్చే ఏడాది విపణిలోకి..

By Sandra Ashok KumarFirst Published Nov 15, 2019, 12:50 PM IST
Highlights

డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 మోటారు సైకిల్ ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన మోటారు సైకిళ్లలో ఒకటి కానున్నది. ఇది త్వరలో ‘ఈఐసీఎంఎ-2019’ ఎగ్జిబిషన్‌లో అడుగు పెట్టనున్నది.

న్యూఢిల్లీ: ప్రపంచంలోకెల్లా అతి శక్తిమంతమైన మోటారుసైకిళ్లలో ఒకటి డుకాటీ ఒకటి. త్వరలో ప్రారంభమయ్యే ‘ఈఐసీఎంఏ 2019’ ఎగ్జిబిషన్‌లో అడుగు పెట్టి విపణిలోకి దూసుకు రావాలని డుకాటీ  స్ట్రీట్ ఫైటర్ వీ4 మోడల్ బైక్ తలపోస్తోంది. 

వాస్తవంగా ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉన్న మోటారు సైకిళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4. వచ్చే ఏడాది మధ్యలో విపణిలోకి డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 రంగ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి. 

aslo read పెరిగిన R E బుల్లెట్ 350 ధరలు.. ఎంతంటే..

ఇప్పటికే విపణిలో ఉన్న వీ4 మోడల్ బైక్, పానిగేల్ వీ4 మాదిరిగానే తాజా స్ట్రీట్ ఫైటర్ వీ4 కూడా దూకుడుగానే ఉంటుంది. పానిగేల్ వీ4 మాదిరిగా వైడర్ హ్యాండిల్ బార్ ఏర్పాటు చేయడంతో స్టయిల్‌గా రైడింగ్ చేయడానికి అనువుగా ఉంటుంది. 

విభిన్న ఇంజిన్ మ్యాపింగ్, ఫైనల్ రేషియోతో పానీగేల్ వీ4 కన్నా అత్యధికంగా స్ట్రీట్ ఫైటర్ టార్చి విడుదల చేయనున్నది. ఆక్రాపోవిక్ ఎగ్జాస్ట్‌తోపాటు 220 హెచ్పీ, 130 ఎన్ఎం టార్చీ విడుదల చేయనున్నది. పానీగేల్ వీ4 మోడల్ బైక్ 1103 సీసీ వీ4 ఇంజిన్, 208 హెచ్పీ, 123 ఎన్ఎం టార్చీని విడుదల చేస్తున్నది. పానీగేల్ వీ4 మోటారు సైకిల్‌తో పోలిస్తే ఆరు కిలోల బరువు తక్కువగా ఉంటుంది. 

also read కొత్త హోండా ఎస్పీ 125 బిఎస్ 6 బైక్ విడుదల

పలు ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్స్‌తో డుకాటీ స్ట్రీట్ ఫైటర్ విపణిలోకి రానున్నది. యాంటీ వీలీ, స్లైడ్ కంట్రోల్, క్విక్ షిప్టర్, ఆటో బ్లిప్పర్, మల్టీ స్టేజ్ ట్రాక్షన్ కంట్రోల్, ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్ తదితర ఫీచర్లు జత కలువనున్నాయి. 5 అంగుళాల కలర్ టీఎఫ్టీ స్రీన్‌తో మోటారు సైకిల్ ప్రెట్టిగా ఉంటుంది. లో నాయిస్ హై టెయిల్ మినిమలిస్టిక్ హెడ్ ల్యాంప్స్‌తో వస్తున్న డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 మోటారు బైక్.. పానీగేల్ వీ4 మాదిరిగానే సక్సెస్ సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. 

click me!