మార్కెట్‌లోకి ‘జాగ్వార్‌’ దేశీ ‘ఎఫ్‌–పేస్‌’ ఆవిష్కరణ

By sivanagaprasad kodati  |  First Published Oct 30, 2018, 9:04 AM IST

టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) మరో మోడల్ కారు దేశీ ‘ఎఫ్-పేస్’ ను మార్కెట్లో ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ కారు లభించనున్నది. పెట్రోల్ వేరియంట్ కారు రూ.63.17 లక్షలు, డీజిల్ వేరియంట్ కారు రూ.63.57 లక్షలు పలుకుతుంది.
 


టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థ జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) మేకిన్‌ ఇండియా పాలసీలో భాగంగా దేశీయంగా ఉత్పత్తి చేసిన జాగ్వార్‌ ‘ఎఫ్‌–పేస్‌’ ఎస్‌యూవీ మోడల్ కారును మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.

పార్క్‌ అసిస్ట్, లేన్‌ కీప్‌ అసిస్ట్, కాబిన్‌ ఎయిర్‌ ఐయోనైజేషన్, డ్రైవర్‌ కండీషన్‌ మానిటరింగ్‌ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. తాజా ఎస్‌యూవీ మోడల్ కారు ఆవిష్కరణ ద్వారా భారత మార్కెట్‌లో జాగ్వార్‌ మరింత మెరుగుపడిందని సంస్థ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ సూరి వ్యాఖ్యానించారు. 

Latest Videos

దేశవ్యాప్తంగా 27 ఔట్‌లెట్ల ద్వారా ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్, ఎఫ్‌–పేస్, ఎక్స్‌జే, ఎఫ్‌–టైప్‌ రేంజ్‌ జాగ్వార్లను సంస్థ విక్రయిస్తోంది. రెండు లీటర్ల టర్బో చార్జ్‌ ఇంజినియం పెట్రోల్‌ ఇంజిన్‌ కల ఈ కారు ధర రూ.63.17 లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ ఇంజిన్ గల కారు రూ.63.57 లక్షలు పలుకుతోంది.

రెండు వేరియంట్లలోనూ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. గతేడాది నవంబర్ నుంచి ఎఫ్-పేస్ మోడల్ కారును భారతదేశంలో నిర్మించినట్లు తెలిపింది. తొలుత పెట్రోల్ వేరియంట్ ఆపై డీజిల్ వేరియంట్ మోడల్ కార్లను తయారు చేశామన్నది. 

జాగ్వార్ లాండ్ రోవర్ నుంచి భారతదేశంలోనే తయారు చేసిన మోడల్ కార్లలో ‘ఎఫ్-ఫేస్’ ఆరవది. ఇంతకుముందు జాగ్వార్ ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్, ఎక్స్‌జే, లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవోక్యూ మోడల్ కార్లను ఆవిష్కరించింది.

177 బీహెచ్పీ పీక్ పవర్, 430 ఎన్ఎం ఆఫ్ పీక్ టార్చితోపాటు రెండు లీటర్ల టర్బో చార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్ అమర్చారు. ఎఫ్- ఫేస్ ఇప్పటికీ 8- స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బ్యాక్, ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ కలిగి ఉన్నాయి. 

లార్జ్ టచ్ స్క్రీన్‌తోపాటు ఎల్ఈడీ హెడ్ లైట్స్, వైఫై హాట్ స్పాట్, జేఎల్ఆర్ యాక్టివ్ కీ బ్రాస్లెట్, అందుబాటులో ఉన్న పది రకాల రంగుల్లో వినియోగదారులకు కనువిందు చేయనున్నది జాగ్వార్ దేశీ ‘ఎఫ్-పేస్’ మోడల్ కారు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ ఎస్ యూవీ మోడల్ కారుతోపాటు త్వరలో రంగ ప్రవేశం చేయనున్న బీఎండబ్ల్యూ ఎక్స్3, ఆడీ 5 మోడల్ కార్లు, సొంత జాగ్వార్ లాండ్ రోవర్ ఎవోక్యూ మోడల్ నే ఢీ కొట్టే లక్ష్యంతో రూపొందించారు. 
 

click me!