ఈ రాశులవారు వన్ సైడ్ లవర్స్...!

By telugu news teamFirst Published Mar 27, 2023, 11:56 AM IST
Highlights

తమ స్వంత అవసరాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. అదే అలవాటుగా మారి.. ఆ తర్వాత తమ జీవితంలోకి వచ్చిన వ్యక్తి పై పెద్దగా శ్రద్ధ చూపించరు.

దాదాపు అందరూ ప్రేమలో పడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ... మనం ప్రేమించినా... మనల్ని ఎదుటి వ్యక్తి ప్రేమించకపోతే చాలా బాధగా ఉంటుంది. వన్ సైడ్ లవ్ ఎప్పటికీ బాధగానే ఉంటుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు ఎక్కువగా వన్ సైడ్ లవర్స్ గా మిగిలిపోతారట. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

1.వృషభం

వృషభ రాశివారు చాలా నమ్మకంగా ఉంటారు. కానీ వారు మొండి పట్టుదలగలవారు. వారు అనుకున్న పని చేయాలనే మొండి పట్టుదల ఎక్కువ. తమకు నచ్చినట్లుగా ఉంటారు. ఈ క్రమంలోనే వీరు ఎక్కువగా వన్ సైడ్ లవర్స్ గా మిగిలిపోతూ ఉంటారు. ఎలాగూ సింగిల్ గా ఉంటాం కదా అని.. వారు  తమ స్వంత అవసరాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. అదే అలవాటుగా మారి.. ఆ తర్వాత తమ జీవితంలోకి వచ్చిన వ్యక్తి పై పెద్దగా శ్రద్ధ చూపించరు.  అది వాని భాగస్వామికి నచ్చకపోవచ్చు.

2.కర్కాటక రాశి..

ఈ రాశివారు చాలా కేరింగ్ గా ఉంటారు.. వారు చాలా ఎమోషనల్, సెన్సిటివ్ గా కూడా ఉంటారు. ఈ రాశివారు తమ జీవితంలో ఎక్కువగా వన్ సైడ్ రిలేషన్ లో ఉంటారు.వీరు తమ భాగస్వామిని అంటిపెట్టుకుని ఉంటారు. అది ఆరోగ్యంగా లేకపోయినా సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. తమ భాగస్వామికి ఇష్టం లేకపోయినా వీరు మాత్రం ప్రేమను పంచుతూనే ఉంటారు.

తులారాశి

తుల రాశివారు ఎక్కువగా గొడవలు ఇష్టపడరు. ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఈ రాశివారు తమ ఆనందం కన్నా కూడా... తమ భాగస్వామి ఆనందానికి  ఎక్కువ విలువ ఇస్తారు. వీరు కనీసం తమకు ఏం కావాలో కూడా తమ భాగస్వామికి చెప్పలేరు. ఎప్పుడూ తమ భాగస్వామి గుించి మాత్రమే ఆలోచిస్తారు. వారికే ఎక్కువ విలువ ఇస్తారు. వారి కోసం త్యాగాలు చేయడానికి కూడా వీరు వెనకాడరు.

ధనుస్సురాశి

వారు స్వతంత్రంగా , సాహసోపేతంగా ఉంటారు.  వారు తమ స్వేచ్ఛను కొంచెం ఎక్కువగానే గౌరవిస్తారు. వారు తమ భాగస్వామి అవసరాలను తీర్చడం మరచిపోరు. వీరు ఎక్కువగా తమ పార్ట్ నర్ కి కనెక్ట్ అవ్వాలని అనుకుంటారు. కానీ వారి భాగస్వామి పెద్దగా పట్టించుకోకపోవచ్చు.

మీనరాశి

మీన రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఇది కొన్నిసార్లు వారి స్వంత అవసరాలకు ముందు వారి భాగస్వామి అవసరాలను తీర్చడానికి ముందుంటారు.. వీరు మాత్రమే ఎక్కువగా ప్రేమిస్తున్నామనే భావనలో ఉంటారు. తమ పార్ట్ నర్ కోపం, ద్వేషం చూపించినా... వీరు మాత్రం ప్రేమ పంచుతూనే ఉంటారు.

click me!