శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ప్రకారం సింహరాశి వారికి ఈ ఏడాది ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవం తగ్గుతుంది. అనవసర ప్రయాణాలు వలన ధన నష్టం కలుగుతుంది.
కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఎలా ఉండబోతోంది? ఎవరికి శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.
ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.
undefined
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఆదాయం:-14
వ్యయం:-2
రాజపూజ్యం:-1
అవమానం:-7
గురుడు:-ఈ సంవత్సర ప్రారంభం నుండి అష్టమ స్థానము నందు సంచారం చేసి ఏప్రిల్ 21 నుండి భాగ్యస్థానం నందు సంచారం చేయను
శని:-ఈ సంవత్సరం అంతా సప్తమ స్థానం నందు సంచారం చేయను
రాహు:-సంవత్సర ప్రారంభమనండి భాగ్యస్థానం నందు సంచారం చేసి అక్టోబర్ 31 నుండి అష్టమ స్థానమునందు సంచారం చేయను
కేతువు:-సంవత్సర ప్రారంభం నుండి తృతీయ స్థానము నందు సంచారం చేసి తదుపరి అక్టోబర్ 31 నుండి ద్వితీయ స్థానం నందు సంచారం చేయను.
వ్యాపార భాగస్వాముల తోటి పెట్టుబడి విషయంలో ఆచితూచి అడుగులు వేయవలెను. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబసభ్యుల తోటి కలహాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు ఆలస్యమగు. ప్రత్యర్థుల తోటి జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. ఇచ్చిన రుణాలు లౌక్యంగా రాబట్టవలెను. మిత్రులతోటి సహచరులతోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. మనస్సునందు భయంగా ఉండుట. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవం తగ్గుతుంది. అనవసర ప్రయాణాలు వలన ధన నష్టం కలుగుతుంది. మానసికంగా శారీరకంగా బలహీనపడతారు. విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం. శారీరక శ్రమ పెరుగుతుంది. ఉద్యోగము నందు అధికారులతో టి గొడవలు ఏర్పడతాయి. ఏప్రిల్ వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న ఏప్రిల్ దాటిన తర్వాత గురు సంచారం అనుకూలించను. తలపెట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. గృహాలాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అయితే శని సప్తమ స్థానం నందు సంచారం వలన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార ముందు పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేయ పని యందు శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలెను. రాహు కేతు గ్రహ సంచారములు కూడా దోష ప్రదముగా ఉన్నది. ఈ రాశి వారికి సంవత్సరం శనికి జపం హోమం తైలాభిషేకము మరియు రాహు కేతువులకు జపదానములు చేయడం మంచిది. శనివారం ఉపవాసము చేయుట శ్రేయస్కారము.
Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సర: కర్కాటక రాశి వారి తెలుగు పంచాంగ సంవత్సర ఫలాలు
ఈ రాశివారి మాసవారీ ఫలితాలలోకి వెళితే...
ఏప్రిల్
అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారం నందు రాణిస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా సాగును. ఆర్థికంగా లాభపడతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రతి చిన్న విషయంలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు. సమాజం నందు చేయూ వ్యవహారములు ఆచుతూచి వ్యవహరించవలెను.
మే
ధన ధాన్యాలు లాభం పొందుతారు. ప్రయత్నించిన కార్యాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో గల ఆనందంగా గడుపుతారు. స్థలము లేకగృహము కొనుగోలు చేస్తారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. వృత్తి వ్యాపారం నందు లాభాలు పొందగలరు.
జూన్
ప్రభుత్వ సంబంధించిన అన్ని పనులు పూర్తగును. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులతో సత్కాలక్షేపం చేస్తారు. ఉద్యోగమనందు అధికారుల యొక్క ఆదర అభిమానాలు పొందగలరు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. సమాజము నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. వివాహ శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.
జూలై
ఈ మాసం అన్న విధాలా అనుకూలించును. వ్యాపారమునందు పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కుజ సంచారం వలన అకారణ విరోధాలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామి తోటి గాని కుటుంబ సభ్యుల తోటి మధ్య మనస్పర్ధలు ఏర్పడవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.
ఆగస్టు
బంధుమిత్రులతోటి విరోధాలు ఏర్పడును. దుష్ట సావాసాలు ఏర్పడతాయి. చేయి వ్యవహారము నందు స్థిరత్వం లేక ఇబ్బందులు పడతారు. వ్యాపారం నందు ధన నష్టం కలగవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలుఎదురవుతాయి. ఉద్యోగంలో పై అధికారులతోటి సమస్యలు ఏర్పడవచ్చు. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు రాగలవు. శుక్ర సంచారం తోటి కొన్ని పనులు సజావుగా సాగును.
సెప్టెంబర్
ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడగలవు. మనసునందు భయంగా ఉండుట. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. తగాదాలకు దూరంగా ఉండవలెను. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడిన పట్టుదల తోటి పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలూ ఉన్నాయి.
అక్టోబర్
ప్రయత్నించిన కార్యాలలో కార్యసిద్ధి లభిస్తుంది. మృతి వ్యాపారములు లాభసాటిగా జరుగును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగమునందు అధికార వృద్ధి కలుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. మానసికంగా ఆనందంగా గడుపుతారు. సమాజం నందు కొద్దిపాటి అపవాదములు కలగొచ్చు.
నవంబర్
అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. ఆరోగ్యం బాగుండును. మనసునందు ఉత్సాహంగా గడుపుతారు. బంధుమిత్రులతోటి సత్కాలక్షేపం చేస్తారు. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ప్రతి చిన్న సమస్యను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
డిసెంబర్
కుటుంబ సౌఖ్యం పొందగలరు. సన్మానాలు బహుమానాలు పొందుతారు. సమస్యలన్నీ తీరి ప్రశాంతత తలపెట్టిన పనులన్నీ అనుకూలంగా పూర్తవును. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగమునందు సహోదయోగ యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. గృహపకరణ అలంకరణ వస్తువులు కు ఎక్కువ ఖర్చు చేస్తారు.
జనవరి
అనవసరమైన ప్రయాణాలు ఇబ్బందులకు గురవుతారు. ఋణ బాధలు పెరుగును. గృహమునందు అనేక సమస్యలతోటి చికాకుగా నుండును. అనేక ఆలోచనలతోటి మనస్సు నందు ఉద్రేకతగా ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. నమ్మినవారు వలన మోసం జరగవచ్చు. భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడగలవు.
ఫిబ్రవరి
వ్యాపారం నందు ధనలాభం కలుగును. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. మీ ప్రత్యర్ధులపై పై చెయి సాధిస్తారు. మిత్రుల ఆదరణ అభిమానాలు పొందగలరు. సంతాన వృద్ధి ఆనందం కలగజేస్తుంది. ఉద్యోగమునందు అధికారుల మన్ననలు పొందగలరు. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. సమాజము నందు మీ మాటకు విలువ పెరుగుతుంది.
మార్చి
పుత్రుల తోటి ప్రతికూలత వాతావరణ. బొంద వర్గం తోటి అకారణంగా కలహాలు ఏర్పడవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారముల సామాన్యంగా ఉంటాయి. మానసికంగా నిరోత్సాహంగా ఉంటుంది. శారీరక శ్రమ పెరిగి అలసట పొందుతారు. ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. మిత్రుల తోటే సఖ్యంగా వ్యవహరించవలెను.