ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారి అవసరాలకు ధన సహాయం అందుతుంది

By telugu news team  |  First Published Mar 9, 2023, 4:00 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  విద్యార్థినీ విద్యార్థులకు సంతృప్తికరమైన ఫలితాలు ఏర్పడగలరు. చిన్న చిన్న అవకాశములు కూడా అందుపుచ్చుకొనవలెను. నిరుద్యోగులకు ఉపాధి మార్గములు ఏర్పడగలవు.


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  
పంచాంగం:       
 
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణ
ఋతువు : శిశిరం
పక్షం : కృష్ణ పక్షము                                                                                         
వారము: గురువారం
తిథి :   విదియ రాత్రి 08.03ని వరకు
నక్షత్రం : హస్త తె 5.12ని వరకు
వర్జ్యం:    మధ్యాహ్నం12.47ని నుండి02.28  ని  వరకు
అమృత ఘడియలు:. రాత్రి  10.52 నుండి 12.33 ని  వరకు
దుర్ముహూర్తం:ఉ.10.12ని నుండి ఉ.10.59ని వరుకు తిరిగి మ.02.55 నుండి మ.03.42 వరకు.
రాహుకాలం:మ.01.30ని. నుండి మ.03.00ని. వరకు
యమగండం:ఉ.06.00ని. నుండి ఉ.07.30ని.  వరకు


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
చేసే పనులన్నీ నూతన ఉత్సాహంతో చేస్తారు. సంఘములో గౌరవం పలుకుబడి పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవును. వృత్తి వ్యాపారాల్లో ధనాధాయం సంతృప్తికరంగా ఉండును. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు తొలగి అన్యోన్యత చేకూరును. శారీరక శ్రమ పని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. తలచిన పనులలో విజయం సాధిస్తారు. ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Latest Videos

undefined


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

ఉద్యోగంలో నిరత్సాహముగా ఉండును. శారీరకంగా బలహీనంగా ఉంటుంది. ఖర్చులను అదుపు చేసుకుని వ్యవహరించవలెను. ప్రయాణమునందు జాగ్రత్త అవసరము. బంధువర్గముతో మనస్పర్ధలు రాగలవు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు. అ కారణ కలహాలు ఏర్పడగలవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు రాగలవు. కుటుంబము నందు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. విలువైన వస్తువులతో జాగ్రత్త అవసరము. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
చేసే పనులలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించును. ఉద్యోగములో సాధారణ పరిస్థితిలు ఉండగలవు. సత్కార్యాచరణ ఆచరిస్తారు. వృత్తి  వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు సంతృప్తికరమైన ఫలితాలు ఏర్పడగలరు. చిన్న చిన్న అవకాశములు కూడా అందుపుచ్చుకొనవలెను. నిరుద్యోగులకు ఉపాధి మార్గములు ఏర్పడగలవు. బంధుమిత్రుడు తోటి కలిసి ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం అష్టలక్ష్మి విలాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ప్రయత్న  కార్యములు  పూర్తి చేస్తారు. బంధువర్గముతో సహాయ సహకారాలు అందుకోగలరు. సామాజిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా మీ అవసరాలకు నిమిత్తం సరిపడినట్లు ఆదాయాన్ని అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ వ్యక్తులచే గౌరవ మర్యాదలు సౌఖ్యములు పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు. ఓం ధైత్య గురవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఆదాయ అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషణ చేస్తారు. పెండింగ్ వ్యవహారములు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారములలో లాభించి రాణిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేయు పనులలో కృషి అభివృద్ధి కనపడును. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పొందగలరు. ఈ రాశి వారు ఈ రోజు ఓం జగన్నాథాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఉద్యోగులకు అధికారులతో వాదోపవాదములు ఏర్పడగలవు. చేసే పనుల్లో ఉత్సాహంగా ఉంటారు. వృత్తి వ్యాపారములలో ఆశించనంత లాభాలు కనబడక నిరోత్సాహం ఏర్పడును. భార్య భర్తల మధ్య సఖ్యత తగ్గి వివాదాలకు దారితీయును. ఆర్థిక ఇబ్బందులున్న ఏదో ఒక విధముగా ధనము చేతికి అందుతుంది. వాహనం ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. చేసే పనుల్లో ఆలోచనలతో... సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం ఛాయా స్వరూపాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఉద్యోగమునందు అధికారులతో వివాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. అనాలోచిత నిర్ణయాల వలన ఇబ్బందులుంటాయి. మానసిక శారీరక అలసటలు పెరుగును. కుటుంబ బాధ్యతలు పెరుగును. విద్యార్థులు చదువు విషయంలో పట్టుదల చూపించాలి. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడతాయి. కేసులు వివాదాల తీర్పులు మీకు ప్రతికూలంగా నుండును. బంధుమిత్రులతో  అకారణంగా కలహాలు  ఏర్పడతాయి. మంచి ఆలోచనలు చేయుట వలన మనసు నందు ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం కపీశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఊహించని విధముగా తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడం వలన మానసిక ఆందోళనకు గురవుతారు. సమాజం లో ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగములో బాధ్యతలు పెరిగి ఒత్తిడికి లోనవుతారు. వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.  వ్యాపారం నందుఊహించని ధన వస్తు నష్టం రావచ్చు. దైవ సంబంధమైన కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ వ్యక్తుల సహకారములు ముఖ్యమైన పనులు పూర్తిచేసుకోవాలి. ఈరోజు ఈ రాశి వారు. ఓ మంగళ స్వరూపిణ్యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేయాలి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సామాన్యంగా ఉండును. పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులచే ప్రతికూల ఏర్పడి ఒత్తిడి లకు గురి కాగలరు. ఆరోగ్యం అనుకూలముగా ఉండను.
ఆదాయానికి సమానంగా ఖర్చులు ఏర్పడను. దురాఆలోచనలకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికిని పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. గృహములో సమాజము నందు గౌరవ ఆదరణలు పొందగలరు. ఆదాయానికి అవసరమైన పనులు చేస్తారు. పనిముట్లు తో గాని యంత్రములతో గాని జాగ్రత్తగా ఉండవలెను. బంధుమిత్రులతో సఖ్యతగా మెలగవలెను. స్థిరాస్తి వ్యవహారములు చికాకులు పరచగలవు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. నీచ జన సహవాసము దురాలోచనలు కు దూరముగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
తలపెట్టిన పనులు కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి గలరు. అధికారులతో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులను అదుపు చేసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో సంతృప్తి పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అకారణ కలహాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాలయందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల  సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం మహా శూరాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
చేసే పనుల్లో కోపము చిరాకులు తగ్గించుకుని వ్యవహరించవలెను. వృత్తి వ్యాపారములు ఆశాజనకంగా సాగుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఏర్పడగలవు. విద్యార్థిని విద్యార్థులు చదువు , శ్రద్ధ వహించవలెను. ఇంటా బయటా విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇతరులతోటి వాదప్రతివాదములకు దూరంగా ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో చికాకులు తప్పవు. ప్రయాల్లోతగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం తారా దీశాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

click me!