17 ఆగస్టు 2018 శుక్రవారం రాశిఫలాలు

By ramya neerukondaFirst Published Aug 17, 2018, 9:43 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. సామాజిక అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. మహిళల సహకారం లభిస్తుంది. ప్రాథమిక విద్యల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. మాతృసౌఖ్యం లోపిస్తుంది. ఆహారంలో సమయపాలన అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అన్యుల ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి. పోటీల్లో ఒత్తిడి ఉంటుంది. అనారోగ్య భావన ఏర్పడుతుంది. దగ్గరి అనుకోని ప్రయాణాలు చేస్తారు. ప్రచార, ప్రసార సాధనాల ద్వారా జాగ్రత్త అవసరం. ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం. క్రీం అచ్యుతానంత గోవింద జపం చేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మాటల్లో జాగ్రత్త అవసరం. తొందరపడి మాటలాడరాదు. నిల్వ ధనం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. కుటుంబంలో అననుకూలత ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శారీరక శ్రమ అధికం. తొందరగా అలసిపోతారు. అనవసర పనులు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సౌకర్యాలవైపు ఆలోచన ఉంటుంది. నిత్యావసర ఖర్చులపైదృష్టి. ఆహారంలో సమయ పాలన అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనవసర ఖర్చులు ఎక్కువగా చేస్తారు. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలపై దృష్టి. పాదాల నొప్పులు ఉంటాయి. స్త్రీల ద్వారా సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి. ప్రచార, ప్రసార సాధనాలు అనుకూలంగా ఉంటాయి. చదువుపై దృష్టి ఎక్కువ. ఇడ్లీ, వడ దానం చేయడం తప్పనిసరి. శ్రీరామజపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అన్ని రకాల ఆర్థిక లాభాలు ఉంటాయి. మాటల్లో మృదుత్వం ఉంటుంది. దురాశ ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. నిల్వ ధనానికి ప్రాధాన్యత ఇస్తారు. స్థిరాస్తులు పెంచుకోవడం పై దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శారీరక శ్రమ ఎక్కువ. ఆలోచనల్లో వైవిధ్యం ఉంటుంది. అనారోగ్య భావన ఏర్పడుతుంది. చేసే వృత్తులలో పోటీ అధికం. అధికారులతో అప్రమత్తత అవసరం. అనవసర ఇబ్బందులు వచ్చే సూచన. కీర్తికోసం ఆరాటం. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : నిత్యావసర ఖర్చులకై ఆలోచన. విశ్రాంతి లభిస్తుంది. శయ్యా సౌఖ్యం ఉంటుంది. విహార యాత్రలపై ఆలోచన ఉంటుంది. సౌకర్యాలపై దృష్టి. ఇతరులపై ఆధారపడతారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. పరిశోధనలపై ఆసక్తి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం జాగ్రత్త అవసరం. చెడు మార్గాల ద్వారా సంపాదనపై దృష్టి ఉంటుంది. అనారోగ్య భావన. పరామర్శలకు వెళతారు. స్త్రీ సంబంధీకులద్వారా ఆదాయంవస్తుంది. కళలపై ఆసక్తి.  శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఉంటుంది. పలుకుబడి కోసం ఆరాటం. వృత్తి ఉద్యోగాదుల్లో మానసిక ఒత్తిడి. అధికారిక ప్రయాణాలపై ఆలోచన. అనవసర ప్రయాణాలు చేస్తారు. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. అనవసర కలహాలు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనారోగ్య భావన ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఒత్తిడితో పోటీల్లో గెలుపు ఉంటుంది. శతృవులతో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలపై ఆసక్తి ఏర్పడుతుంది.   శుభకార్యాల్లో పాల్గొంటారు. ఔషధసేవనం అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : మానసిక ఒత్తిడిఉంటుంది. ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. సంతానంవల్ల సమస్యలు ఉంటాయి. అనవసర ఖర్చులపై దృష్టి ఏర్పడుతుంది.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఇతరులపై ఆధారపడడం. చెడు మార్గాలద్వారా ధనసంపాదనపై దృష్టి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపంమంచిది.
 

డా|| ఎస్‌. ప్రతిభ

click me!