15జులై 2019 సోమవారం రాశిఫలాలు

Published : Jul 15, 2019, 09:20 AM IST
15జులై 2019 సోమవారం రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ప్రయాణాల్లో ఒత్తిడి ఉంటుంది. శ్రమ, కాలం, ధనం వృథా అవుతుంది. పనుల ఒత్తిడి అధికం. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. దూర దృష్టి ఉంటుంది. విద్యార్థులకు కష్టసమయం.  అనవసర ప్రయాణాలు చేస్తారు. శివపూజ, గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనవసర కష్టాలు తెచ్చుకుటాంరు. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. శ్రమ, కాలం, ధనం వృథా అవుతాయి. పరాధీనం ఉంటుంది. శివపూజ, గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంటాయి. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. విరోధులు పెరుగుతారు. పలుకుబడికోసం ఆలోచన ఉంటుంది. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. స్హే సంబంధాల్లో జాగ్రత్త అవసరం. శివపూజ, గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. సంతృప్తి తక్కువ. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. గుర్తింపుకై ఆరాట పడతారు. అనుకున్న ఉండదు. శివపూజ, గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ఒత్తిడి అధికం. సంతాన సమస్యలు పెరుగుతాయి.  ఆలోచిత చర్యలపై దృష్టి ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడితో ఉంటుంది. సృజనాత్మకతను కోల్పోతారు. అనవసర ఖర్చులు చేస్తారు. సంతృప్తి తక్కువగా ఉంటుంది. శివపూజ, గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  సౌకర్యాలు ఒత్తిడికి గురిచేస్తాయి. మాతృ సౌఖ్యం లోపం ఉంటుంది. గృహ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అనుకున్నంత అభివృద్ధి సాధించలేరు. విద్యార్థులకు ఒత్తిడితో కూడుకున్న సమయం. ఆశించిన లాభాలు రావు. సంతృప్తి లోపం ఏర్పడుతుంది. శివపూజ, గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సహకారం లభిస్తుంది. ప్రయాణాల్లో సంతృప్తి ఉంటుంది. కమ్యూనికేషన్స్‌ బాగా విస్తరిస్తాయి. ఆకస్మిక ధనలాభం సూచితం.  చిత్త చాంచల్యం అధికంగా ఉంటుంది. సమీప వ్యక్తులు అనుకూలిస్తారు. పనుల్లో సానుకూలత ఏర్పడుతుంది. శివపూజ, గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  మాటల్లో నైరాశ్యం కనబడుతుంది. కుటుంబంలో అసంతృప్తి ఉంటుంది. ఆర్థిక నిల్వలు కోల్పోయే ప్రమాదం. వాగ్దానాలు నెరవేరకపోవడం. కంటి సంబంధ దోషాలు పెరుగుతాయి. చేసే అన్ని పనుల్లో నిరాశ, నిస్పృహలు ఉంటాయి. శివపూజ, గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటపడతారు. పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. కార్యసాధనలో పట్టుదల అవసరం. అన్ని రకాల ఒత్తిడులు ఏర్పడతాయి. అనారోగ్యం వచ్చే సూచనలు. సమయం వృథా అవుతుంది. నిరాశలు అధికం. శివపూజ, గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రలకై దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. అనారోగ్య సూచన. శివపూజ, గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి. 

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అన్యుల ద్వారా లాభాలు వచ్చే సూచన. ఆదర్శంగా ఉండడంకోసం ప్రయత్నిస్తారు. విద్యార్థులకు కష్టపడే కాలం.    శ్రమ, కాలం, ధనం వృథా అవుతాయి. శివపూజ, గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఒత్తిడితో ప్రయాణాలు చేస్తారు. అధికారులతో అప్రమత్తత అవసరం. ఉద్యోగంలో అనవసర ఇబ్బందులు వచ్చే సూచన. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాట పడతారు. అనవసర ఖర్చుల సూచన. జాగ్రత్త అవసరం. శివపూజ, గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.

-----డా. ఎస్‌. ప్రతిభ
 

PREV
click me!

Recommended Stories

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు!
Venus Ketu Conjunction: కేతు, శుక్రుల దయతో ఆగస్టు వరకు ఈ 5 రాశులవారికి తిరుగేలేదు!