మే నెల రాశిఫలాలు

By telugu team  |  First Published May 1, 2019, 8:05 AM IST

ఈ నెల రాశిఫలాలు


1. మేషం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. జన సహకారం ప్రయోజనకరంగా ఉండును. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం. వృత్తి, ఉద్యోగ విషయాలలో ద్వితీయార్ధంలో అనుకూల వాతావరణం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ద్వితీయార్ధంలో సోదర జన సహకారం బాగుండును. 19,20 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, శివారాధన శ్రేయస్కరం.

2. వృషభం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. మిత్రులతో అనుబంధాలు పెరుగుతాయి.  ఆరోగ్య సమస్యలున్నప్పికీ వ్యాయామ ప్రాణాయామాలతో వాిని అధిగమించే అవకాశం ఉంటుంది. మ్లాడేటప్పుడు ఆచితూచి  వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. 21,22 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి నవగ్రహ స్తోత్ర పారాయణ, ఆదిత్య హృదయస్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, విష్ణ్వారాధన శ్రేయస్కరం.

Latest Videos

undefined

3. మిధునం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమముగా ఉండును. వీరికి ప్రథమార్ధములో ఆదాయము బాగుండును. గృహ, కుటుంబ విషయాలలో ఆనంద ప్రద వాతావరణం నెలకొనును.వృత్తి వ్యాపారాలలో అనూకూల వాతావరణం.సామాజిక సంబంధాల విషయంలో ఆలస్యాలు, అపార్థ్ధాలు వచ్చే  అవకాశం ఉన్నది. 23,24,25 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా  మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయ  స్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.  

4. కర్కాటకం : వీరికి గోచారగ్రహస్థితి అనుకూలత ఎక్కువగా ఉన్నది. వీరికి వృత్తి, ఉద్యోగ  విషయాల్లో పదోన్నతి, ఆర్థిక లాభాలు కలుగును. సంతాన వర్గం అభివృద్ధి చెందును. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. వీరికి పొీ రంగములో విజయావకాశాలు  అధికంగా ఉండును. ఆరోగ్యం బాగుండును. 26,27 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా  మంచిది. వీరికి  దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.    

 5. సింహం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం.  వృత్తి, ఉద్యోగ విషయములలో పదోన్నతి సూచితం. విద్యార్ధులకు ఉత్తమ సమయం. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం. విద్యావిషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. ఆర్ధిక ప్రయోజనాలు  బాగుాంయి.  ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. 28,29 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా  మంచిది. వీరికి దత్తాత్రేయ స్తోత్రపారాయణ, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

6. కన్య : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం.  ఆకస్మిక ధనలాభం సూచితం.స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. గృహ, కుటుంబ విషయాల్లో శ్రద్దఅవసరం. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాదులలో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్ధులకు శ్రమ అధికం. 4,5,31 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, లక్ష్మీ ఆరాధన, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ  శ్రేయస్కరం.

7. తుల : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. ఆకస్మిక ధనలాభం సూచితం. మాట విలువ పెరుగును. సేవకజనసహకారం లభించును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. గృహ, కుటుంబ విషయాలలో మనస్ఫర్ధలు రాకుండ జాగ్రత్త వహించవలెను. ప్రయాణాది విషయాల్లో జాగ్రత్త అవసరం. 6,7 తేదీలలో ముఖ్య నిరయాల వాయిదా మంచిది.వీరికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, లక్ష్మీస్తోత్ర పారాయణ, దుర్గా స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

8. వృశ్చికం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. పొీ రంగంలో విజయావకాశములు అధికం. గృహ, కుటుంబ విషయాలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. మీరు చేసే పనులు ఇతరులకు ఉపకరించే విధంగా ఉంాయి. సంతాన వర్గం వారు అభివృద్ధి సాదిస్తారు. ఇతరులతో ఆచితూచి మ్లాడటంవలన గౌరవం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. 8,9తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయస్తోత్ర పారాయన, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

9. ధనుస్సు : ఈ రాశి వారికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలు ఆనంద ప్రదంగా ఉంాయి. పొీ రంగంలో విజయావకాశాలు అధికంగా  ఉంాయి. బంధు మిత్రులకై  వ్యయాలు అధికముగ  చేస్తారు. విద్యార్ధులకు ఉత్తమ సమయం. స్నేహతులతో ఆచితూచి వ్యవహరించాలి. 10,11 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా వేయండి. వీరికి దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గా స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

 10. మకరం : ఈ రాశి వారికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. విద్యార్ధులకు ప్రధమార్థం ఉత్తమ సమయం. పొీ రంగంలో విజయావకాశాలు అధికంగా ఉంాయి. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును.  మిత్రులవలన ఆధికలాభాలు సమకూరుతాయి.  శత్రువులపై విజయాలను సమకూర్చుకోగలుగుతారు. 12,13,14 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్య హృదయస్తోత్రపారాయణ,  శివారాధన శ్రేయస్కరం.  

11. కుంభం : వీరికి గోచారగ్రహస్థితి శుభశుభమిశ్రం. జనసహకారం  ప్రయోజనకరంగా ఉండును. విద్యార్ధులకు ఉత్తమ సమయం. గృహ, కుటుంబ విషయాల్లో ఆనందప్రద వాతావరణం. వృత్తిలో ఇతరులకు మేలు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్ధిక పయోజనాలు బాగుాంయి. నిర్ణయాలు తీసికోవడం విషయంలో ఏకాగ్రత లోపం వలన కొన్ని చిక్కులు ఎదురౌతాయి. 15,16 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

12. మీనం : ఈ రాశి వారికి గచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమం.  వీరికి జనసహకారం ప్రయోజనకరంగా ఉంటుంది. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం.మాట విలువ, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది.  ఆధ్యాత్మిక విషయాసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాదులలో ఆచితూచి వ్యవహరించవలెను. విద్యార్ధులకు శ్రమ అధికం. 17,18 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి శివారాధన, దుర్గాస్తత్ర పారాయణ, కేతు స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.  

డా.ఎస్.ప్రతిభ

click me!