జోతిష్యం ప్రకారం.. ఈ పేరుతో ఉన్నవారు.. ఉత్తమ భర్తలౌతారు..!

Published : Feb 26, 2022, 01:45 PM ISTUpdated : Feb 26, 2022, 01:47 PM IST
జోతిష్యం ప్రకారం.. ఈ పేరుతో ఉన్నవారు..  ఉత్తమ భర్తలౌతారు..!

సారాంశం

 జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింది పేరుతో మొదలయ్యే వారు.. భవిష్యత్తులో మంచి భర్తలు అవుతారట. తమ భార్యలను చాలా బాగా చూసుకుంటారట. మరి ఆ పేర్లేంటో ఓసారి చూద్దాం..

బిడ్డ పుట్టగానే.. ఏ నక్షత్రంలో పుట్టాడో తెలుసుకొని.. దాని ప్రకారం పేరు పెడుతూ ఉంటారు. ఆ పేరు ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింది పేరుతో మొదలయ్యే వారు.. భవిష్యత్తులో మంచి భర్తలు అవుతారట. తమ భార్యలను చాలా బాగా చూసుకుంటారట. మరి ఆ పేర్లేంటో ఓసారి చూద్దాం..

ప్రతి అమ్మాయికి తన కు నచ్చిన జీవిత భాగస్వామి కావాలని, తనను ఎంతో ప్రేమించాలని, సంతోషంగా ఉండాలనే కోరిక ఉంటుంది. కొన్ని అక్షరాలు ఉన్న యువకుడు తన భార్యను అన్ని విషయాల్లో ప్రేమిస్తాడట.  అన్ని విషయాల్లోనూశ్రద్ధ వహిస్తాడు, గౌరవిస్తాడు, మద్దతు ఇస్తాడు. భార్య కళ్లలో నీళ్లు రాకుండా చూసుకుంటాడు. ఉత్తమ భర్త పేరులో మొదటి అక్షరం ఏంటో ఓసారి చూద్దాం..

డి అక్షరంతో ప్రారంభించే యువకులు తమ భార్యతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు, భార్యను  అడుగుతూనే ఉంటారు. వీరు చాలా కేరింగ్.  తన భార్య కలలన్నింటినీ నెరవేర్చాలని కోరుకుంటారు. అతని భార్య  అలిగితే.. అలక ఎలా తీర్చాలో వీరికి బాగా తెలుసు.


ఎ అక్షరంతో పేర్లను ప్రారంభించే అబ్బాయిలకు భార్య అంటే చాలా ఇష్టం. ఆమె అవసరాలన్నీ వారు తీరుస్తారు.సమాజంలో భార్య పట్ల గౌరవం పెరిగేలా చేస్తారు. సంబంధం యొక్క మాధుర్యాన్ని కాపాడుకోవడానికి వారు తమను తాము కోల్పోతారు. అలాంటి వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. భార్యతో చాలా ప్రేమగా ఉంటారు.

N అక్షరంతో మొదలయ్యే అబ్బాయిలు చాలా సపోర్ట్ చేస్తారు. భార్య ఏ నిర్ణయం తీసుకున్నా వీరు  వారికి అండగా ఉంటారు. ఆమెను ప్రోత్సహిస్తారు.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. అన్ని సంతోషాలు భార్యకు ఇస్తారు.  వారు ఆమె ఆనందంలో వారి ఆనందాన్ని కోరుకుంటారు. వీరిని ఉత్తమ భర్తగా చెప్పొచ్చు. 


P అక్షరంతో పేరు మొదలయ్యే అబ్బాయిల మృదు స్వభావం. భార్య ఎంత కోపంగా ఉన్నా ప్రశాంతంగా ఉండగలడు. అతను తన భార్య అన్ని లక్షణాలను ఇష్టపడతాడు. ఆమె బాధపడితే చూడలేరు. భార్య తప్పు చేసినా పట్టించుకోకుండా క్షమించగలడు. భార్యను చాలా ప్రేమిస్తాడు.

PREV
click me!

Recommended Stories

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారితో జాగ్రత్త… పైకి చాలా మంచివారిలా కనిపిస్తారు!
Elinati Shani: ఈ రాశులకు శని పీడ తప్పదా? ఎక్కువ కష్టాలు పడేది వీరే..!