జాతకం...వైవాహిక జీవితం, ఉద్యోగంలో కష్టాలు

By ramya NFirst Published Feb 5, 2019, 3:39 PM IST
Highlights

వైవాహిక జీవనసౌఖ్యంలో లోపం ఉంటుంది. అనుకున్నంత ఆనందంగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక లోపం కనబడుతూ ఉంటుంది. సామాజికంగా తన నిర్ణయాలే చెల్లుబాటు కావాలి అనే మనస్తత్వం కలిగి ఉంటారు.

లగ్న చతుర్థాధిపతి గురుడు; సప్తమ దశ మాధిపతి బుధుడు; నవమాధిపతి రవి అష్టమంలో ఉన్నారు. అష్టమాధిపతి చంద్రుడు పంచమంలో ఉన్నాడు.

గురుడు శుభగ్రహమే కాని లగ్న చతుర్థాధిపతియై అష్టమంలో ఉన్నాడు. తన ఆలోచనల వలన తాను ఇబ్బంది పడతారు. గృహ, వాహన సౌఖ్యాలు అంతగా ఉపయోగపడవు. వాటి గురించి ఎప్పుడూ దిగులుగానే ఉంటారు.

సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. వైవాహిక జీవనసౌఖ్యంలో లోపం ఉంటుంది. అనుకున్నంత ఆనందంగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక లోపం కనబడుతూ ఉంటుంది. సామాజికంగా తన నిర్ణయాలే చెల్లుబాటు కావాలి అనే మనస్తత్వం కలిగి ఉంటారు.

బుధుడు దశ మాధిపతి కూడా కావడం వలన ఉద్యోగంలో ఎప్పుడూ తనకు శత్రువులు ఉంటారు. ఎన్ని ఉద్యోగాలు మారినా అక్కడ కొత్త శత్రువులు తయారవుతారు. తనను అణగద్రొక్కే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉద్యోగ విషయంలో వీరు జాగ్రత్తగా ఉండడం అవసరం.

నవమాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నాడు. పూర్వపుణ్యలోపం కూడా ఉంటుంది.  నవమం తృప్తినిచ్చే స్థానం. నవమాధిపతి అష్టమంలో ఉండడం వలన ఏదో చేయాలనే తపన చాలా ఉంటుంది. కాని అనుకున్నది సాధించలేరు. జీవితంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.

అష్టమాధిపతి అయిన చంద్రుడు పంచమంలో ఉండడం వలన సంతానసంబంధమైన లోపాలు ఉంటాయి. సంతానం ద్వారా సమస్యలు వస్తాయి. సమస్యలు అధికంగా ఉండడం  వలన సంతానం వలన ఇబ్బందులు.

అష్టకవర్గులో అష్టమ నవమ భావాలు పూర్తిగా బిందువులు తక్కువ ఇచ్చాయి. ఆకస్మిక నష్టాలకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నవమంలో బిందువులు తక్కువగా ఉండడం వలన అనుకున్న పనులు వెంటనే పూర్తి కావు. అనుభూతి లోపం అత్యధికమౌతుంది. వాటి గురించి చాలా తపన పడాల్సి వస్తుంది.

ఇష్టఫల కష్టఫలాల్లో శని, శుక్ర, బుధ గ్రహాలు కష్టఫలితాన్నే ఎక్కువగా ఇచ్చాయి. కాబట్టి వారి గ్రహ దశ  అంతర్దశల్లో తామిచ్చే ఫలితాలు పొందడం కోసం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది.

వీరు జీవితంలో అనుకున్న పనులు పూర్తి కావాలనుకుని తాము తమ సంతానం అభివృద్ధిలోకి రావాలనుకుంటే అష్టమంలో ఉన్న గ్రహాలకు సంబంధించిన దానాలు జపాలు నిరంతరం చేస్తూ ఉండాలి. వీరి కర్మదోషాలు పూర్తిగా తొలగాలంటే చాలా ఎక్కువగా కర్మ దోష నివారణలు చేసుకోవాల్సి ఉంటుంది. వీని ద్వారా ఆలోచనల్లో మార్పులు ఏర్పడి దోష నివారణ జరుగుతుంటుంది. దానాలు జపాలు చేసినప్పుడు అభివృద్ధి ఆ సమయంలో ఉంటుంది. తర్వాత వెంటనే తగ్గిపోతుంది. కాబట్టి జీవితాంతం చేసుకోవడం అవసరం.

జాతకంలోని అష్టమంలోని గ్రహాల లోపాలను పూర్వకర్మ దోషాలుగా భావించి ఈ క్రింది జ్యోతిర్వైద్య ప్రక్రియల రీత్యా నివారణ చర్యలు చేసుకోవాలి.

జ్యోతిర్వైద్యం :

వస్త్రం : (చంద్ర) క్రీం కలర్‌ వస్త్రాలు, (రవి) ఆరెంజ్‌కలర్‌ వస్త్రాలు, (బుధ) ఆకుపచ్చ వస్త్రాలు, (గురు) పసుపురంగు వస్త్రాలు అవసరార్థికి దానం ఇవ్వాలి.

ధాన్యం : పాలు, పాల సంబంధిత వస్తువులు, అన్నదానం (బియ్యం), గోధుమలు, గోధుమపిండి, రొట్టెలు, క్యారెట్బ్‌ పెసర పప్పు, ఆకుకూరలు, చక్కెర అనాదశ  శరణాలయాల వారికి, అవసరార్థులకు దానం చేయాలి.

హోమం : చంద్ర, రవి, బుధ, గురు గ్రహాలకు సంబంధించిన హోమం కనీసం 3 నె|| ఒకసారి చేయించుకోవాలి.

జపం : బుధ, గురు గ్రహ అధిదైవాలైన విష్ణు, గురు దేవతా జపాదులు చేసుకోవాలి.

తీసుకునే ఆహారం : మొలకలు వచ్చిన పెసలు, చపాతీలు ఆహారంలో ఎక్కువగా ఉండాలి.

వీరు పై విధమైన జ్యోతిర్వైద్య ప్రక్రియల ద్వారా నివారణ చర్యలు ప్రారంభించారు. జీవితం ఆనందమయంగా గడుపుతున్నారు.

click me!