జాతకం.. నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా?

By ramya NFirst Published Feb 22, 2019, 2:01 PM IST
Highlights

మాకు పంపిన కొందరి జాతక వివరాలు ఇక్కడ ఉన్నాయి 

1.అరుణ్‌ కుమార్‌

ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా?

ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వేరు వేరు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలకు అవకాశం చాలా ఎక్కువగా ఉంది. టువిం ఉద్యోగాలు ప్రయత్నం చేసుకోవచ్చు. చిన్న వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. మాట విలువ తగ్గకుండా సమస్యలు రాకుండా చూసుకోవాలి. మౌనంగా ఉండడం మంచిది.

జపం : శ్రీ రాజమాతంగ్యైనమః జపం మంచిది.

దానం : గోధుమపిండి, గోధుమరొట్టెలు; పిల్లలకు అలంకరణ వస్తువులు, పులిహోర, కూరగాయలు, ఆకుకూరలు, పశుపక్షాదులకు దానం చేయడం మంచిది.

2. కె. రాజశేఖర్‌

వివాహం ఎప్పుడు అవుతుంది?

వివాహానికి జూన్‌ వరకు చాలా అనుకూల సమయం. 2020 వరకు జీవితం చాలా ఆనందంగా సాఫీగా సాగుతుంది. తర్వాత కొంచెం ఇబ్బంది ఉంటుంది. ప్రస్తుతం ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కావున దానాలు ఎక్కువగా చేయడం మంచిది.

దానం : అలంకరణ వస్తువులు/ పులిహోర; 2. అనదానం, పాలు/ పెరుగు దానం చేయడం మంచిది.

జపం : దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి వివాహం భాగ్యమారోగ్యం పుత్రలాభంచ దేహిమే జపం చేసుకోవడం మంచిది.

జపాలు, దానాలు ఎక్కువగా చేసుకోవడం వల్ల వివాహ జీవితం, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది.

3. కిరణ్‌ కుమార్‌

20.7.2019 వరకు సమయం అంత అనుకూలంగా లేదు. అన్ని పనుల్లో ఒత్తిడి చికాకులు ఉంటాయి. 2020 అక్టోబర్‌ తర్వాతన అంత ఒత్తిడిగా ఉంటుంది. అన్ని పనుల్లో జాగ్రత్త వహించాలి. చికాకులు ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి.

జపం: శ్రీరామ జయరామ జయజయ రామ రామ, శ్రీ మాత్రే నమః జపం మంచిది.

దానం : గోధుమరొట్టెలు, గోధుమపిండి; కందిపప్పు, ఖర్జూరాలు, దానిమ్మపళ్ళు దానం చేయడం మంచిది.

4.. మల్లికార్జున రెడ్డి

ఉద్యోగం, వ్యాపారం, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది?

ఉద్యోగ వ్యాపారాలు పర్వాలేదు కాని వైవాహిక జీవితం 2020 ఆగస్టు తర్వాత అనుకూలంగా ఉంటుంది. వివాహానికి పనికిరాదు.

5.మధు

మీ జనన వివరాలు సరిగా లేవు. పుట్టిన సమయం తెలుపనందున జాతకం చెప్పడానికి కుదరదు.

6. మార్య కుమారి

పెళ్ళి ఉద్యోగం విషయాలు తెలుపండి.

ఏదో ఒక ఉద్యోగం ఇప్పుడు దొరుకుతుంది. ఏప్రిల్‌ తర్వాత ఇంకా బావుంటుంది. ఇప్పుడు వివాహానికి అనుకూల సమయం కాదు. 2022లో వివాహానికి ప్రయత్నం చేసుకోవాలి. ఓవర్‌ ఆల్‌గా జాతకం చాలా బావుంది.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ; శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది. ఇవి వివాహానికి మరియు ఉద్యోగానికి బాగా ఉపకరిస్తాయి.

దానం : 1. నూనె అవసరం ఉన్నవారికి ఇంట్టిలో వాడుకోవడానికి, / పల్లీలు/ దేవాలయాల్లో దీపారాధనకు వినియోగించాలి.2. కందిపప్పు/ దానిమ్మపళ్ళు / ఖర్జూరాలు, 3. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాలి. ఇవి నిరంతరం తప్పకుండా దానం చేస్తూ ఉండాలి.

7. శ్రీనివాస్‌

మీ జాతక వివరాలలో పుట్టిన సమయం తెలియజేయలేదు. పుట్టిన సమయం లేనిదే జాతక వివరాలు చెప్పడం కష్టం. సమయం పంపించగలరు.

click me!
Last Updated Feb 22, 2019, 2:01 PM IST
click me!