ఏ రాశివారికి ఏ రంగు కలిసి వస్తుంది..?

By ramya neerukondaFirst Published Nov 3, 2018, 2:15 PM IST
Highlights

మనిషి మనస్తత్వం కూడా వారి జాతకాదులను అనుసరించి వేరు రంగులపై ఇష్టపడడం వ్యతిరేకించడం జరుగుతుంది. మనం జాతకాన్ని అనుసరించి ఆయా రంగుల విశేషాలను పరిశీలించవచ్చు.

మానవ జీవనం అంతా వెలుగులు మీద ఆధారపడి ఉంటుంది. సూర్యకాంతి బయికి తెలుపురంగు కనిపించినా వేరు వేరు వస్తువులపై వేరువేరు రంగుల ప్రభావాలు ఉంటాయి. మనిషి మనస్తత్వం కూడా వారి జాతకాదులను అనుసరించి వేరు రంగులపై ఇష్టపడడం వ్యతిరేకించడం జరుగుతుంది. మనం జాతకాన్ని అనుసరించి ఆయా రంగుల విశేషాలను పరిశీలించవచ్చు.

మేషరాశి : ఈ రాశివారు ఎరుపురంగు మరియు ఆకుపచ్చ రంగులు ఇష్టపడతారు. కాని వీరు ఆ రంగు వాహనాలు కాని, వస్త్రాలు కాని ధరించకపోవడం మంచిది. అత్యవసర పరిస్థితిలో ఆకుపచ్చరంగు వస్త్రాలు, వాహనాలు తీసుకోవచ్చు కాని ఎరుపు రంగును అస్సలు ఉపయోగించరాదు. వీరు ఆ రంగు వస్త్రాలను ఇంకా ఆ రంగు ఆభరణాలను, ఆహార పదార్థాలను దానం చేయడం మంచిది.

వీరు ఉపయోగించే రంగులు మొదట పసుపు రంగు, తరువాత ఆరెంజ్‌ కలర్‌. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి.

వృషభరాశి : ఈ రాశివారు పసుపు రంగు మరియు తెల్లటి తెలుపును ఇష్టపడతారు. ఆ రంగులు వీరు ఉపయోగించకూడదు.  వీరు తప్పనిసరి పరిస్థితిలో తెలుపురంగు వాహనాలు ఉపయోగించవచ్చు కాని పసుపు పచ్చ రంగును వీరు అస్సలు ఉపయోగించరాదు.

వీరు ఉపయోగించే రంగులు ఆకుపచ్చ, నీలం.

మిథునరాశి : వీరు ఎరుపు నీలం రంగులను ఉపయోగించరాదు. ఎరుపు రంగును సమయానుకూలంగా ఉపయోగించాలి.

వీరు ఆకుపచ్చ, తెలుపు రంగులు వీటిని మాత్రమే ఉపయోగించాలి.

కర్కాటక రాశి : ఈ రాశివారు పసుపు రంగును ఉపయోగించరాదు అలాగే నీలం రంగును, ఆకుపచ్చ రంగును ఉపయోగించరాదు. తప్పనిసరైన పసుపును, రెండవ అవకాశంగా ఆకుపచ్చను ఉపయోగించాలి.

వీరు ఉపయోగించే రంగులు ఎరుపు, పసుపులు అధికంగా ఉపయోగించాలి. మొదట ఎరుపు రంగు తరువాత పసుపు రంగు.

సింహరాశి : ఈ రాశివారు పసుపు రంగును నీలం రంగును ఉపయోగించరాదు. వీరు తప్పనిసరి పరిస్థితిలో పసుపు రంగు ఉపయోగించవచ్చు. కాని నీలం రంగు ఉపయోగించరాదు.

కన్యారాశి : ఈ రాశివారికి ఉపయోగించకూడదని రంగులు ఎరుపు, మరియు నీలర రంగులు. అవకాశం లేకపోతే నీలాన్ని ఉపయోగించవచ్చు. కాని ఎరుపును అస్సలు ఉపయోగించకూడదు.

వీరు సాధారణంగా ఉపయోగించే రంగులు మొదట తెల్లని తెలుపు, తరువాత వరుసలో నీలం రంగును ఉపయోగించాలి.

తుల రాశి : ఈ రాశివారు పసుపు, తెల్లటి తెలుపు రంగు అంటే మెరిసే తెలుపు రంగును ఉపయోగించరాదు.

వీరు వాడుకునేవి ఎక్కువగా ఆకుప్చరంగు అలాగే నీలం రంగులు అయి ఉండాలి.

వృశ్చిక రాశి : వీరు ఎరుపు రంగును ఆకుపచ్చ రంగును వదిలిపెట్టాలి. ఎక్కువగా పసుపు రంగు అలాగే ముదురు తెలుపు రంగును వినియోగించాలి.

ధనుస్సు రాశి : వీరు ముదురు తెలుపు గాని తెల్లటి తెలుపు రంగులు కాని ఉపయోగించరాదు. వీరు ఎరుపు రంగును కాని ఆరెంజ్‌ రంగును కాని తప్పనిసరిగా ఉపయోగించాలి.

మకరరాశి : ఈ రాశివారు ఆకుపచ్చను అలాగే ఆరెంజ్‌ రంగులను ఉపయోగించరాదు. ఇతర అవకాశాలు ఏమీ లేకపోతే ఆకుపచ్చరంగు వాడుకోవచ్చు. తెల్లటి తెలుపును ఎక్కువగా వాడాలి. తరువాత ఆకుపచ్చ పరవాలేదు.

కుంభరాశి : వీరు ముదురు తెలుపును ఉపయోగించరాదు. అలాగే ఆకుపచ్చ రంగును ఉపయోగించరాదు. వీరు ఎక్కువగా ఉపయోగించేది తెల్లటి కాంతివంతమైన తెలుపు రంగు మాత్రమే ఉపయోగించాలి. అవసరమైన నీల రంగును ఉపయోగించుకోవచ్చు.

డా.ఎస్.ప్రతిభ

మీనరాశి : ఈ రాశివారు ఆరెంజ్‌ కలర్‌ మరియు తెల్లటి తెలుపు రంగును వాడకూడదు. వీరు ఉపయోగించే రంగులు    ముదురు తెలుపు, అలాగె ఎరుపు రంగును ఉపయోగించాలి.

ఏరాశివారు ఏఏ రంగులను ఎందుకు వాడకూడదో తరువాతి వ్యాసాలలో వివరంగా అధ్యయనం చేద్దాం...

 

click me!