దీపాల పండుగ దీపావళి

By ramya neerukondaFirst Published Nov 7, 2018, 9:06 AM IST
Highlights

లక్ష్మీదేవికికూడా చీకటి అంటే ఇష్టం ఉండదు. చీకటి అంధకారం ఉన్నచోట తాను ఉండదు. శుక్రగ్రహం తెలుపుకు  సంకేతం. మూల చైతన్యం కూడా తెలుపు రంగులోనే ఉంటుంది. తెలుపులో అన్ని రంగులు కలిసిపోతాయి.

సమస్త సంపత్సువిరాజమానా సమస్త తేజస్సువిభాసమానా

విష్ణుప్రియే త్వం భవదీప్యమానా వాగ్దేవతా మే వదనే ప్రసన్నా

అనే భావాన్ని గమనిస్తే సంపద అనే అంశం మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. అసలు సంపద అంటే ఏమి? అన్ని సంపదలతో విరాజమాన అయిన వాగ్దేవి, లక్ష్మీదేవి, శక్తి స్వరూపిణిని ప్రార్థించటం.

లోకంలో సంపదలు అనగానే ధనం అనే అర్థాన్నే చూస్తున్నాం. ధనమూలమిదం జగత్‌ అనే నానుడి ప్రకారం ధనంతో ఏదైనా సాధించవచ్చు. ధనం లేకుంటే ఏమీ సాధించలేము కాబ్టి ధనమే లక్ష్మీదేవిగా భావించి పూజించే సంప్రదాయం పెరిగింది. వరలక్ష్మీదేవి పూజలు, ధనలక్ష్మీ పూజలకు అధికమైన ప్రాధాన్యం పెంచుకున్నాం. కాని అమ్మవారు అష్టలకక్ష్ముల రూపాలలో మనకు కనిపిస్తుంది.

శుద్ధ లక్ష్మీః మోక్షలక్ష్మీః జయ లక్ష్మి సరస్వతీ

శ్రీః లక్ష్మీః వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా

ఈ శ్లోకం ప్రకారం మోక్షం కూడా లక్ష్మీదేవిగా కనిపిస్తుంది. విజయం, సరస్వతి కూడా లక్ష్మీ రూపాలుగానే కనిపిస్తాయి. ఇవన్నీ లక్ష్మీ రూపాలే. అందుకే సంపద అంటే లక్ష్మీరూపం.

ఏదైనా పని నిర్వహించాలంటే మనికి ఆ పనికి సంబంధించిన స్పష్టమైన, సమగ్రమైన భావన ఏర్పడి, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అందువల్ల లక్ష్యాన్ని సాధించడానికి మనిషికి ధైర్యం కావాలి. ధైర్యం లేకుంటే ఏ కార్యక్రమమూ ముందుకు సాగదు. కాబ్టి ధైర్యమూ లక్ష్మీ రూపమే.

సంతానము కూడా ఒక లక్ష్మీ స్వరూపం. శరీరంలో హార్మోన్‌ విభజన సరిగా లేకపోతే సంతానం కలుగదు. కాబట్టి శుక్రునికి అనుకూలతలు పెంచుకోవడం కోసం కూడా ఈ లక్ష్మీ పూజలు అధికంగా చేయాలి. శుక్ర గ్రహానికి అలంకరణలు, అందమైన ప్రదేశాలు, ఆకర్షణగల విషయాలు చాలా ఇష్టం. అలంకరణలు ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉంటాడు. కాబ్టి ఈ దీపావళి రోజున ఇంటి ముందు, ఇంటిలో అన్నీ దీపాలు వెలిగించి, స్త్రీలు ఆభరణాలు పెట్టుకుని అందరగా తయారై సాయంకాలం పూట లక్ష్మీపూజలు చేస్తూ ఉంటారు.

లక్ష్మీదేవికికూడా చీకటి అంటే ఇష్టం ఉండదు. చీకటి అంధకారం ఉన్నచోట తాను ఉండదు. శుక్రగ్రహం తెలుపుకు  సంకేతం. మూల చైతన్యం కూడా తెలుపు రంగులోనే ఉంటుంది. తెలుపులో అన్ని రంగులు కలిసిపోతాయి.  ఆ రంగు మాత్రమే కాంతివంతంగా కనబడుతుంది. కాబ్టి లక్ష్మీ పూజలు నిరంతరం చేసుకునేవారు కూడా ఆ చైతన్యంతో ఎప్పుడూ ఆనందంగా సుఖ సంతోషాలతో విరాజిల్లుతూ ఉంటారు. ఎప్పుడూ సంతోషంగా ఉండేవారిలోనే సెలిటోనిన్‌ అనే హార్మోన్‌ రిలీజ్‌ అవుతుంది. ఆ హార్మోన్‌ సంతోషానికి ఆనందానికి సంకేతం. ఇది ఆరోగ్యానికి ఆయుష్యుకు కూడా కారణం అవుతుంది. ఎక్కువ ఆనందంగా ఉండేవాళ్ళు ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవిస్తారనేది ఒక పరిశోధనలో చెప్పిన విషయం.

మనం చేసుకునే పండుగలు కూడా చీకిని తొలిగించి వెలుగులను దర్శించగలగడం. వెలుగున్నచోట లక్ష్మీస్థితి ఉంటుంది. అందువల్ల లక్ష్మీపూజలు ఈ సమయంలో ప్రత్యేకంగా ఉంటాయి. విజ్ఞాన లక్ష్మి అందరి మనస్సులను ప్రేరేపించాలి.

డా.ఎస్.ప్రతిభ

click me!