జాతకంపై శని ప్రభావం ఎలా ఉంటుంది..?

By ramya neerukondaFirst Published Sep 8, 2018, 2:53 PM IST
Highlights

ద్వాదశ భావాల్లో శని సంచరిస్తూంటే ఫలితం ఈవిధంగా ఉంటుంది.

1. జన్మంలో సంచరిస్తూంటే శరీరానికి బద్ధకం పెరుగుతుంది. ఏ పని చేయాలన్నా శరీరం వెంటనే సహకరించదు. ఏ కొత్త పనులు చేయడానికి పూనుకోరాదు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. వాకింగ్‌, ప్రాణాయామాలు, యోగాసనాలు తప్పనిసరిగా వేయాలి.

2. ద్వితీయంలో సంచరిస్తూంటే మాట విషయంలో, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. మాటకు విలువ లేకుండా ఉంటుంది. తాను తక్కువ మ్లాడుతూ, ఎదుటి వారికి మ్లాడే అవకాశాన్ని కల్పిస్తూ, ఎక్కువగా వినే ప్రయత్నం చేయాలి. నిరంతరం జపం చేసుకుంటూ ఉండడం మంచిది.

3. తృతీయంలో సంచరిస్తూంటే సేవకజన సహకారం బాగా లభిస్తుంది. శని సేవక వృత్తిని సూచిస్తాడు. సహకారం లభించడం లేదని ఆలోచన వదిలి పెట్టాలి   వీరు సహకారాన్ని ఎక్కువగా అందిస్తూ ఉండాలి. శారీరక శ్రమ ఎక్కువగా చేయాలి.

4. చతుర్థంలో సంచరిస్తూంటే ఆహారసౌఖ్యం, కుటుంబసౌఖ్యం తక్కువగా ఉంటుంది. దీనినే అర్ధాష్టమశని అంారు. సరియైన సమయానికి భోజనం చేయకపోవడం వలన అనారోగ్య ఇబ్బందులు ఏర్పడతాయి. వీరు ఆహారాన్ని నమిలి తినే ప్రయత్నం చేయాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. వ్యర్థాలను బయటికి  పంపే ప్రయత్నం చేయాలి.

5. పంచమంలో సంచరిస్తూంటే ఆలోచనలలో ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మికపరమైన ఆలోచనల వైపు దృష్టి పెంచుతారు.

6. షష్ఠంలో సంచరిస్తూంటే శ్రమతో కూడిన ఫలితాలు లభిస్తాయి. పోీతత్వం పెరుగుతుంది. ఫలితాలు సాధించడానికి చాలా కష్టపడతారు. ఒకవేళ పోటీల్లో  గెలవకపోయినా చింతించ కూడదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి.

7. సప్తమంలో సంచరిస్తూంటే భాగస్వాములు, సామాజిక సంబంధాలు దెబ్బతింయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. జీవిత భాగస్వాములతో అననుకూలత ఏర్పడుతుంది. సర్దుకుపోయే తత్వం అలవాటు చేసుకోవాలి.

8. అష్టమంలో సంచరిస్తుంటే ఆకస్మిక నష్టాలు, అనారోగ్య సమస్యలు మొదలౌతాయి. వీరు దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. ప్రాణాయామం, యోగాసనాలు, వాకింగ్‌ తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ద్రవ పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

9. నవమంలో సంచరిస్తూంటే ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తుంటారు. ఉపాసనలు చేయడం, దీక్షలు తీసుకోవడం చేస్తారు. ఉన్నత విలువలవైపు దృష్టి సారించాలి. నిరంతర జపం చేసుకోవడం మంచిది.

10. దశమంలో సంచరిస్తుంటే ఉద్యోగరీత్యా అధికారుల వలన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభుత్వోద్యోగంలో ఉండేవారైతే చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. శనికి రవి శత్రువు కాబ్టి. శ్రీ రాజమాతంగ్యై నమః జపం నిరంతరం చేసుకోవడం మంచిది.

11. లాభంలో సంచరిస్తుంటే వ్యాపార పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టపడిన దానికి ఫలితాలు తప్పకసాధిస్తారు. దానికిగాను ఎక్కువ శ్రమపడవలసి వస్తుంది. దానాలు చేస్తూ జపం చేసుకుంటూ ఉండాలి.

12. వ్యయంలో సంచరిస్తున్నప్పుడు వ్యక్తి నిద్రకు దూరమౌతాడు. ప్రశాంతమైన నిద్ర ఉండదు. ఒత్తిడితో కూడుకున్న నిద్ర వలన ఉదయాన్నే లేచి పనులు సంతోషంగా చేసుకోలేడు. బద్ధకంగా ఉంటుంది. రాత్రి నిద్ర ప్రభావం రోజులో అన్ని పనులమీదా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఎక్కువౌతాయి. శని వ్యయంలో సంచరిస్తున్నప్పి నుంచి ఏలినాటి  శని ప్రభావం మొదలౌతుంది.

click me!