అప్పు తీసుకున్నవాళ్లు డబ్బు తిరిగి ఇవ్వడం లేదా? ఈ ట్రిక్ వాడి చూడండి..!

ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని రెమిడీలను పాటించడం వల్ల మీ డబ్బు మీకు తిరిగి మీ చేతికి చేరుతుంది. మరి, దాని కోసం ఏం చేయాలో  ఇప్పుడు తెలుసుకుందాం...


ఈ రోజుల్లో ఎదుటివారికి సహాయం చేయడం కూడా పాపం అయిపోతోంది. కష్టంలో ఉన్నారు కదా, లేదంటే.. అవసరంలో ఉన్నారు కదా అని డబ్బులు ఇస్తే.. మళ్లీ తిరిగి మనకు అవసరం వచ్చినా ఇవ్వరు. ఇలా ఇతరులకు డబ్బులు ఇచ్చి... తిరిగి మళ్లీ చేతికి రాక చాలా మంది బాధపడుతున్నారు. మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే.. ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని రెమిడీలను పాటించడం వల్ల మీ డబ్బు మీకు తిరిగి మీ చేతికి చేరుతుంది. మరి, దాని కోసం ఏం చేయాలో  ఇప్పుడు తెలుసుకుందాం...

జోతిష్యం ప్రకారం.. పసుపును చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పసుపు లేకుండా.. ఏ పూజా, ఏ శుభకార్యం పూర్తి కాదు. అందుకే.. పసుపును చాలా కీలకమైనదిగా పరిగణిస్తాం. అంతేకాదు... ఆర్థిక సమస్యలు ఉన్నా వాటిని తొలగించడంలో  పసుపు మనకు సహాయపడుతుంది. మరి, పసుపుతో ఆర్థిక సమస్యల నుంచి ఎలా బయటపడాలో చూద్దాం

Latest Videos

పసుపును ఉపయోగించి మనం ఒక రెమిడీ ఫాలో అవ్వడం వల్ల ... లక్ష్మీదేవి కటాక్షం కచ్చితంగా లభిస్తుందట. ఆదాయం పెరగడంతో పాటు.. ఎక్కడైనా ఆగిపోయిన డబ్బులు కూడా  తిరిగి మళ్లీ మీకు అందుతాయి.

దీని కోసం మీరు గురువారం ఎంచుకోవాలి. గురువారం పూట చేయడం వల్ల ఫలితం చాలా తొందరగా, అనుకూలంగా వస్తుందట. దాని కోసం.. గురువారం రోజున మీ చేతి నిండా బియ్యం తీసుకోవాలి. ఆ బియ్యానికి పసుపు బాగా రాయాలి. ఇప్పుడు ఈ బియ్యాన్నీ ఎదైనా ఎర్రటి క్లాత్ లో వేసి.. ముడి వేయాలి. కావాలంటే.. వీటిలోని కొన్ని పసుపు బియ్యానీ మీ పర్సులో కూడా ఉంచుకోవచ్చు.

ఎర్రటి క్లాత్ లో ముడి వేసి ఉంచిన  పసుపు బియ్యాన్ని.. మీరు ఇంట్లో మీరు డబ్బు, బంగారం దాచుకునే  లాకర్ లో పెట్టాలి. ఇక్కడ కాదు అంటే.. మీరు డబ్బులు ఎక్కడెక్కడ దాచుకుంటారో ఆ ప్లేస్ లో అయినా పెట్టుకోవచ్చు. ఈ రెమిడీ  ఫాలో అవ్వడం వల్ల.. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు... ఆగిపోయిన మీ డబ్బులు కూడా మీకు వచ్చి చేరతాయి. మీరు చాలా కాలంగా పడుతున్న సమస్య నుంచి ఈజీగా బయటపడే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.


 

click me!