జాతకం.. నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా..?

By ramya NFirst Published Mar 2, 2019, 2:18 PM IST
Highlights

మాకు పంపిన కొందరి జాతకాల వివరాలు ఇక్కడ ఉన్నాయి

1. రామచంద్ర మూర్తి (రాజమండ్రి)

ప్రస్తుతం ఉద్యోగం లేదు. ఎప్పుడు రావచ్చు. ?

మే 2 2019 తర్వాత మంచిది మరియు కొత్త ఉద్యోగానికి అవకాశం ఉంది. మీ పాప జాతకం వివరాలు అడిగారు. పాప జాతకం పంపితే అందులో చూసి ఆ అమ్మాయి వివాహ సమయం చెప్పడానికి సాధ్యమౌతుంది కాని మీ జాతకంలో చూసి చెప్పలేము.

దానం : నూనె, 2. పెసరపప్పు/ కూరగాయలు, 3. పశుపక్షాదులకు ఆహారం, 4. గోధుమపిండి/ గోధుమరొట్టెలు. నిరంతరం దానం చేయాలి.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః , శ్రీరామ జయరామ జయజయ రామరామ మంచిది.

2. కె. సుబ్బారెడ్డి (నెల్లూరు)

ఫ్యూచర్‌ ఎలా ఉంటుంది?

జూన్‌ వరకు సమయం బావుంది. 18 జూన్‌ 2019 తర్వాత 1 సంవత్సరం పాటు అనుకూలంగా ఉండదు. ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 2020 మే తర్వాత కొంత పరిస్థితుల్లో మార్పు ఉన్నప్పికీ పూర్తి అనుకూలం కాదు. అన్ని విషయాల్లోనూ జాగ్రత్త అవసరం. ఇప్పినుంచి భాగస్వామ్య వ్యవహారాలు, విషయాల్లో ఎప్పికీ జాగ్రత్తగా ఉండడం మంచిది.

జపం : 1. మంగళం భగవాన్‌ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, మంగళాయతనం హరిః,

2. హరహర శంకర జయజయ శంకర జపం నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

దానం : ఇడ్లీ వడ, 2. కందిపప్పు/ దానిమ్మపళ్ళు / కర్జూరాలు, 3. అన్నదానం/ పాలు/ పెరుగు, 4. గోధుమ పిండి, / గోధుమరవ్వ. నిరంతరం దానం చేస్తూ ఉండడం మంచిది.

3. మహేశ్వరరావు (భద్రాద్రి కొత్తగూడెం)

ఎలా ఉంటుంది?

మీ జాతకరీత్యా మీరు ఇచ్చిన సమయం దృష్ట్యా ఆ సమయంలో రెండు లగ్నాలు మారుతున్నందున ఫలితాల వివరణ విషయంలో కొంచెం శ్రమతో కూడుకుని ఉంటుంది. అయినప్పికీ దాదాపు 2019 చివరికు సమయం అంత అనుకూలంగా లేదు. 2019 తర్వాత ఒకిన్నర సంవత్సరాలు అనుకూలంగా ఉంటుంది. శ్రమపడితే దూర ప్రాంత ప్రయాణాలకు అవకాశం ఉంది. అక్కడే ఉద్యోగాలకు కూడా అవకాశం ఉంది. కొన్ని దానధర్మాలు అధికంగా చేసుకుంటే  బావుంటుంది. ప్రస్తుత సమయంలో ప్రత్యేక డెవలప్‌మ్‌ెం చేయడానికి పనికిరాదు. మీరు యోగా ప్రాణాయామాలు నిరంతరం చేస్తూ ఉండాలి. తప్పదు.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ, 2. హర హర శంకర, జయజయ శంకర. జపాలు మంచివి.

దానం : నూనె/ పల్లీలు, 2. పెసరపప్పు/ కూరగాయలు, 3. గోధుమపిండి/ గోధుమరొట్టెలు 4. పళ్ళు / విద్యార్థులకు పుస్తకాలు నిరంతరం దానం చేయాలి.

4. ప్రసాద్‌ (పశ్చిమ గోదావరి)

ఉద్యోగం మరియు భవిష్యత్తు ఎలా ఉంది?

ప్రస్తుతం జాతకరీత్యా సమయం చాలా బావుంది. 2019 ఆగస్టు తర్వాత 1 సం|| జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకం శుభ యోగాలతో కూడిన జాతకం. చెప్పిన దానాలు జపాలు లాటి మంచి పనులు బాగా చేస్తూ ఇంకా ఎక్కువగా ఆనందంగా ఉండండి

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః 2. హరహర శంకర జయజయ శంకర

దానం: గోధుమపిండి / గోధుమరవ్వ; 2. అలంకరణ వస్తువులు/ నిమ్మకాయ పులిహోర దానం చేస్తూ ఉండండి.

5. వెంకటసాయి హర్ష వర్ధన్‌ (గిద్దలూరు)

ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా. ఎందులో అవకాశం ఉంటుంది?

మీకు వ్యాపార భావనలు బాగా ఉన్నప్పికీ వృత్తిలో సంతృప్తి అంతగా ఉండదు. సహజంగా మీ మనస్తత్వం అడ్మినిస్ట్రేషన్‌ వైపు వెళుతుంది. వీటన్నిదృష్ట్యా ఏదైనా సంస్థను ఎస్టాబ్లిష్‌ చేసి వ్యాపారం చేయడం లేదా స్కూల్‌ టీచర్‌గా సిెల్‌ కావడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశాలు తక్కువ. ఈ సంవత్సరం తొందరగా స్థిర పడడానికి ప్రయత్నం చేయండి. తర్వాత స్థిరపడడానికి ఒత్తిడి బాగా ఉంటుంది.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః; శ్రీరామ జయరామ జయజయ రామరామ మంచిది.

దానం : అన్నదానం / పాలు/ పెరుగు, 2. ఆకుకూరలు/ పెసరపప్పు, 3. నిమ్మకాయ పులిహోర, అలంకరణ వస్తువులు దానం చేయండి.

6. నారాయణ రావు (తణుకు)

ఆర్థిక పరిస్థితి బాలేదు. ఎలా ఉంటుంది?

2020 ఫిబ్రవరి తర్వాత మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రస్తుతం సమయం అంత బాగాలేదు. మీరు అనుకున్న లక్ష్యాలను 2020 తర్వాత చేరుతారు. అనుకున్న రీతిలో స్థిరత్వం ఉంటుంది. ఎప్పికీ చికాకులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరం.

మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కాబట్టి దాచిపెట్టాలనే ఆలోచన ఉండరాదు.

మీరు యోగా ప్రాణాయామాలు నిరంతరం చేయాలి. ఉదయం నడక అయినా తప్పనిసరిగా చేయాలి.

దానం :  1. ఆకుకూరలు/ పెసరపప్పు, 2. గోధుమపిండి / గోధుమరవ్వ; 3. నూనె, పల్లీలు నిరంతరం దానం చేయాలి.

జపం : శ్రీ దత్త శ్శరణం మమ, 2. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంచిది.

click me!