లోకేశ్ ఎక్కడ... బయటకెందుకు రావడం లేదు: వాసిరెడ్డి పద్మ

By Siva KodatiFirst Published Mar 13, 2019, 12:59 PM IST
Highlights

అక్రమాస్తుల కేసుల్లో జగన్‌పై సీబీఐ నమోదు చేసిన చార్జీషీటును చంద్రబాబు చెప్పినట్లు తయారు చేశారని ఆరోపించారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముసుగులు తొలగిపోతున్నాయన్నారు. 

చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి జగన్‌పై ఆరోపణలు చేసినట్లే.. లక్ష్మీనారాయణ నమోదు చేసిన 12 చార్జీషీట్లు ఉన్నాయని పద్మ ఆరోపించారు. ఈడీ లెటర్ చంద్రబాబు చేతికి ఎలా వచ్చిందని వాసిరెడ్డి ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ ఎందుకు పెట్టలేదన్నారు. సింగపూర్ పర్యటనల పేరుతో ఏ విదేశీ బ్యాంకుల్లో లెక్కలు సరిచూసుకోవాడానికి వెళుతున్నారన్న అన్న కోణంలో ఈడీ దృష్టి పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

సింగపూర్‌కు రైతుల వ్యవసాయ భూమిపై ఈడీ ఎందుకు పట్టించుకోవడం లేదని పద్మ ప్రశ్నించారు. వైఎస్ భారతి పేరును చార్జీషీటులో పెట్టాలని ఈడీ ప్రయత్నించిందని దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.

సీబీఐ, ఈడీ సంస్థలు రెండు బాబు జేబు సంస్థలని ఆమె ధ్వజమెత్తారు. డేటా చోరీ వ్యవహారంతో మంత్రి నారా లోకేశ్ బయటకు రావడానికి సైతం గడగడలాడుతున్నారని పద్మ విమర్శించారు

click me!