
అమరావతి: వాయుపుత్రుడు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ భారత్ కు సురక్షితంగా తిరిగి రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. అభినందన్ భారత్ కు తిరిగి రావడం సంతోషకరమన్నారు.
అభినందన్ దేశభక్తికి చంద్రబాబు నాయుడు వందనం చేశారు. అభినందన్ విడుదలపై చంద్రబాబు ట్వీట్ చేశారు. పాకిస్థాన్‌లో అభినందన్ ప్రదిర్శించిన ధైర్య సాహసాలను చంద్రబాబు కొనియాడారు.
అభినందన్ క్షేమంగా తిరిగిరావాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. మరోవైపు అభినందన్ ధైర్యశాలి అని, అతనికోసం తానూ ప్రార్థిస్తున్నానని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అతను త్వరలోనే మన గడ్డమీదకు తిరిగి వస్తాడని ట్విట్టర్ లో ఆకాంక్షించారు లోకేష్ .