కాకాణి వర్సెస్ కోటంరెడ్డి: వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో పంచాయతీ

Siva Kodati |  
Published : Oct 09, 2019, 03:14 PM IST
కాకాణి వర్సెస్ కోటంరెడ్డి: వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో పంచాయతీ

సారాంశం

ఎంపీడీవో సరళపై దాడి చేశారని కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కాకాణి స్కెచ్ ఉందని ఆరోపిస్తున్నారు శ్రీధర్ రెడ్డి. దీంతో జిల్లా వైసీపీలో రాజకీయ దుమారం మొదలైంది

నెల్లూరు వైసీపీలో ముసలం పుట్టింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డికి గత కొన్ని నెలలుగా కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా కోటంరెడ్డి అరెస్ట్‌తో ఈ విభేదాలు రచ్చకెక్కాయి. ఎంపీడీవో సరళపై దాడి చేశారని కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కాకాణి స్కెచ్ ఉందని ఆరోపిస్తున్నారు శ్రీధర్ రెడ్డి.

దీంతో జిల్లా వైసీపీలో రాజకీయ దుమారం మొదలైంది. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో నెల్లూరు వైసీపీ నేతలు భేటీ అయ్యారు.

ఈ సమావేశానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వరప్రసాద్ తదితరులు హాజరై ఇద్దరు నేతల మధ్య వివాదంపై చర్చిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu