ప్రధాని మోడీని కలిసిన వైసీపీ ఎంపీలు.. ‘కుల గణన’పై ఏపీ సర్కార్ తరపున స్పెషల్ రిక్వెస్ట్

Siva Kodati |  
Published : Mar 30, 2022, 03:38 PM IST
ప్రధాని మోడీని కలిసిన వైసీపీ ఎంపీలు.. ‘కుల గణన’పై ఏపీ సర్కార్ తరపున స్పెషల్ రిక్వెస్ట్

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీతో వైసీపీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, అయోధ్య రామిరెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీ జనగణన నిర్వహించాలని ప్రధానిని కోరారు. 

ప్రధాని నరేంద్ర మోడీని (narendra modi) ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ (ysrcp) ఎంపీలు కలిశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ (pilli subhash chandra bose) , మోపిదేవి వెంకటరమణ (mopidevi venkata ramana) , అయోధ్య రామిరెడ్డిలు (ayodhya rami reddy) ..  ఈ సందర్భంగా బీసీ జనగణనపై (bc census) వినతి పత్రం అందజేశారు. దేశంలో 53 శాతం మంది బీసీలు ఉన్నారని.. అయినా బీసీలను రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా.. చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఓబీసీల అభివృద్ధికి, ప్లానింగ్ కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమని వైసీపీ ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంటు, శాసనసభ, న్యాయవ్యవస్థలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని.. బీసీ జనగణన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. 

మరోవైపు కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో (ap assembly) జగన్ సర్కార్ (ys jagan) తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. 1931లో చివరిసారిగా కులపరమైన జనాభా గణన జరిగిందని సీఎం జగన్ గుర్తు చేశారు. గత 90 ఏళ్లుగా కులపరమైన జనాభా లెక్కలు లేవని.. దేశంలో బీసీల జనాభా 52 శాతంగా ఉందని.. వెనుకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అసలు కులగణన జరగలేదని.. కులగణన డిమాండ్‌కు తాము కేంద్రానికి మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకొస్తున్నామని.. ఈ రెండున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు జరిగాయని సీఎం అన్నారు. బీసీ కులగణన జరిగితే మరింత వెసులుబాటు కలుగుతుందని.. కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.

ఇటు ప్రతిపక్షం టీడీపీ (tdp) కూడా బీసీ జనగణన చేపట్టాలని కోరుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababu naidu) కూడా ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బీసీ జనగణన చేపట్టాలని.. సరైన సమాచారం అందుబాటులో లేకపోవడంతో బీసీలకు అన్యాయం జరుగుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేసినా ఆయా వర్గాలు ఇంకా వెనకబడే ఉంటున్నాయని.. బీసీ జనగణన జరిగితేనే సంక్షేమ ఫలాలు అందుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. బీసీ జనగణనపై టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడున్న కులాల వారీ వివరాలు 90 ఏళ్ల నాటివని చంద్రబాబు చెప్పారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్