30-40 ఏళ్ల కిందటి సైకిళ్లు .. శీను మాయ ఏంటో తెలియాలి: విజయసాయి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jul 17, 2020, 02:29 PM ISTUpdated : Jul 17, 2020, 02:44 PM IST
30-40 ఏళ్ల కిందటి సైకిళ్లు .. శీను మాయ ఏంటో తెలియాలి: విజయసాయి వ్యాఖ్యలు

సారాంశం

తెలుగుదేశం పార్టీ ఎంపీల ఢిల్లీ పర్యటనపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫైరయ్యారు

తెలుగుదేశం పార్టీ ఎంపీల ఢిల్లీ పర్యటనపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫైరయ్యారు. శుక్రవారం వరుస ట్వీట్లతో స్పందించిన ఆయన... రాష్ట్రపతికి కంప్లైంట్ల పేరుతో పచ్చ బ్యాచ్ ఢిల్లీలో కొత్త డ్రామాలు మొదలెట్టారు.

నేరం చేసిన వారిపై కేసు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లు, అవినీతిపరులను అరెస్ట్ చేస్తే రాజ్యాంగం విఫలం అయినట్లు, శాంతి  భద్రతలు క్షిణించినట్లు అంట. మీ డ్రామాలు చూసి ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి' అంటూ విమర్శించారు.

తెలుగుదేశం హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు సైకిళ్లను అందజేయాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన బడికొస్తా పథకంలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. దీనిపైనా సాయిరెడ్డి స్పందించారు.

‘‘ బడికొస్తా పథకం పేరుతో లక్షా 82 వేల సైకిళ్లు బాలికలకు పంపిణీ చేశారట. ఎందరికి అందాయో, ఇచ్చినట్లు రికార్డుల్లో రాశారో దర్యాప్తులో వెల్లడవుతుంది. 30-40 ఏళ్ల కిందటి సైకిళ్లు ఇప్పటికీ రోడ్లపైన కనిపిస్తాయి. మూడేళ్లలోనే అమ్మాయిల సైకిళ్ల గంటలు ఎందుకు మూగబోయాయో శీను మాయ తెలియాల్సి వుందంటూ సెటైర్లు వేశారు. 

 

 

 

PREV
click me!

Recommended Stories

Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!